ATP: మరోసారి చిక్కుల్లో గోరంట్ల మాధవ్..!

by Vemula.Srinu Prasad |

మరోసారి వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ చిక్కుల్లో పడ్డారు...

ATP: మరోసారి చిక్కుల్లో గోరంట్ల మాధవ్..!
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌(Former YCP MP Gorantla Madhav)కు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు(Vijayawada Cyber ​​Crime Police) జారీ చేసి విచారణకు రావాలని నోటీసులు అందించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన మర్చిపోకముందే ఆయన మరోసారి చిక్కుల్లో పడ్డారు. గురువారం పోలీసులు నుంచి నోటీసులు అందుకున్న సమయంలో గోరంట్ల మాధవ్ హాట్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వంపై అతర్యుద్ధం తప్పదంటూ హెచ్చరించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే ఆయన్ను చిక్కుల్లోకి నెట్టాయి. ప్రభుత్వాన్ని ఉద్దేశించి గోరంట్ల చేసిన వ్యాఖ్యలపై కూటమి నాయకులు సీరియస్ అయ్యారు. అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్‌కు టీడీపీ(Tdp), జనసేన(Janasena) నేతలు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో అలజడి సృష్టించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని, శాంతి భద్రతలకు సైతం విఘాతం కలిగేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. గోరంట్లపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Next Story