Tenth Result: పది మూల్యాంకనంపై.. జగన్ ​వర్సెస్ ​లోకేశ్ .. జగన్ ​హయాంలో రీ కౌంటింగ్ లెక్కలు బయటపెట్టిన మంత్రి

by Thanuru Gopichand |

పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాకనంపై మాజీ సీఎం జగన్ ​, ప్రస్తుత మంత్రి నారా లోకేశ్ మధ్య ఆరోపణలు సాగుతున్నాయి.

Tenth Result: పది మూల్యాంకనంపై.. జగన్ ​వర్సెస్ ​లోకేశ్  .. జగన్ ​హయాంలో రీ కౌంటింగ్ లెక్కలు బయటపెట్టిన మంత్రి
X

టెన్త్​ మూల్యాంకనంపై ఆరోపణలు, విమర్శలు

99.75 శాతం ఖచ్చితత్వంతో మూల్యాంకనం జరిగింది

మానవ తప్పిదం 0.25 శాతం మాత్రమే

జగన్​హయాంలో రీ కౌంటింగ్ లెక్కలు బయటపెట్టిన మంత్రి

టెన్త్‌ పరీక్షల నిర్వహణలో పూర్తిగా లోకేశ్​ఫెయిల్​అయ్యారన్న జగన్​

దిశ, డైనమిక్​ బ్యూరో : పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాకనంపై మాజీ సీఎం జగన్ (YS Jagan)​, ప్రస్తుత మంత్రి నారా లోకేశ్​(Nara Lokesh) మధ్య ఆరోపణలు సాగుతున్నాయి. ‘ మీ కొడుకు విద్యాశాఖ మంత్రి లోకేశ్​ టెన్త్‌ పరీక్షల నిర్వహణలో పూర్తిగా ఫెయిల్‌ అయ్యారు’ అంటూ నిన్న వైఎస్​జగన్​చేసిన ఆరోపణలకు మంత్రి నారా లోకేశ్​ఘాటుగా బదులిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో, ప్రస్తుత తమ ప్రభుత్వంలో టెన్త్​రీ వెరిఫికేషన్​, రీ కౌంటింగ్​గురించి లెక్కలతో స హా వివరించారు. ’ఈ ఏడాది 45,96,527 లక్షల విద్యార్థుల జవాబు పత్రాలను మూల్యాంకనం చేయడం జరిగింది. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ తరువాత మార్కులలో వ్యత్యాసం వచ్చిన జవాబు పత్రాల సంఖ్య 11,175. అంటే 99.75 శాతం ఖచ్చితత్వంతో మూల్యాంకనం జరిగింది. మానవ తప్పిదం 0.25 శాతం మాత్రమే. ఈ ఏడాది కూడా 34,709 మంది విద్యార్థులు 66,363 స్క్రిప్టుల రీ కౌంటింగ్, (Re Counting) రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

ఇందులో 10.159 మంది విద్యార్థుల 11,175 స్క్రిప్టుల (16.8శాతం) వ్యత్యాసాలను గుర్తించి, సరిచేశామని ఆయన వివరించారు. బాధ్యులపై చర్యలు కూడా తీసుకున్నాం అని పేర్కొన్నారు. జగన్​హయాంలో 2022లో 41,694 స్క్రిప్టుల రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో 8.235 స్క్రిప్టుల (20 శాతం) వ్యత్యాసాలను గుర్తించారు. 2023లో 61,887 స్క్రిప్టుల రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో 10,987 స్క్రిప్టుల (18 శాతం) వ్యత్యాసాలను గుర్తించారు. 2024లో 55.930 స్క్రిప్టుల రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో 9,231 స్క్రిప్టుల (17 శాతం) వ్యత్యాసాలను గుర్తించారు..’ అని లెక్కలు తేల్చారు. మీ హయాంలో కనీసం ఈ వివరాలను బయట పెట్టే ధైర్యం కూడా చెయ్యలేదు. ఈ వాస్తవాలను మరుగున పెట్టి మాపై బురద జల్లడం సిగ్గుచేటు అని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

అంతకు ముందుకు జగన్​ఒక ట్వీట్​చేస్తూ ‘10వ తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనాన్ని కూడా సరిగ్గా నిర్వహించలేని దుస్థితిలో ఉన్న మీరు, మిగతా వ్యవస్థలను ఇంకా ఎంత ఘోరంగా నడుపుతున్నారో అర్థం అవుతోంది..’ అంటూ అందు లో పేర్కొన్నారు. మన రాష్ట్రంలో చదివే ప్రతి విద్యార్థి ప్రపంచస్థాయిలో పోటీని ఎదుర్కొనేలా తీసుకొచ్చిన అనేక సంస్కరణలను వచ్చీరాగానే దెబ్బతీశారని ఆరోపించారు. దీనికి కూడా మంత్రి లోకేశ్​సమాధానం ఇచ్చారు. జి.ఓ 117, (GO 117) ఇతర అసంబద్ధ నిర్ణయాల వలన మీ ఐదేళ్ల ఏలుబడిలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 12 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ల బాట పట్టారని సమాధానం ఇచ్చారు. రూ.4500 కోట్ల ఫీజు రీయిబర్స్మెంట్ బకాయిలు, గుడ్ల దగ్గర నుండి చిక్కీల వరకూ రూ.1000 కోట్లు బకాయిలు నా నెత్తిన పెట్టి పోయారని అన్నారు. మీరు భ్రష్టు పట్టించిన వ్యవస్థను గాడిన పెట్టేందుకు నిరంతరం శ్రమిస్తున్నాను. టీచర్ ట్రాన్స్పర్ యాక్ట్ ద్వారా రాజకీయాలకు అతీతంగా ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ చేపడుతున్నాం అని మంత్రి వివరించారు.

Next Story