- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
BIG Warning: కొన్ని రోజులు చికెన్‌కు దూరంగా ఉండండి

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మరోసారి బర్డ్ ఫ్లూ(Bird Flu) కలకలం రేపింది. తూర్పు గోదావరి జిల్లా కానూరు పౌల్ట్రీల్లో(Poultry) వరుసగా కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. స్థానికులు అధికారులకు సమాచారం ఇవ్వగా.. శాంపిల్స్‌ను టెస్టుల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. రిపోర్ట్స్‌లో బర్డ్ ఫ్లూ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఉభయ గోదావరి జిల్లాల్లో కొద్ది రోజులుగా పౌల్ట్రీల్లో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఉభయ గోదావరి(Godavari) జిల్లా కలెక్టర్ ర్యాపిడ్ టీమ్‌లను నియమించారు. చనిపోయిన కోళ్లను దూర ప్రాంతాల్లో ఖననం చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రజలంతా కొన్నిరోజుల పాటు చికెన్‌కు దూరంగా ఉండాలని సూచనలు చేశారు.
నిర్లక్ష్యం చేసి తింటే.. ప్రమాదం కొని తెచ్చుకున్నట్లే అని హెచ్చరించారు. ముఖ్యంగా తాడేపల్లిగూడెం, తణుకు, ఉంగుటూరు పరిసర ప్రాంతాల్లో సుమారు రెండు లక్షల కోళ్ళు మృత్యువాత పడ్డాయి. బర్డ్ ప్లూ వవ్చిన కానూరుకు 10 కిలోమీటర్ల పరిధిలో పోలీసులు 144, 133 సెక్షన్ అమలు చేస్తున్నారు. వైరస్ లక్షణాలు ఏ ఒక్కరిలో కనిపించిన వారికి యాంటీ వైరస్ మందులు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని.. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని తూర్పుగోదావరి జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ టీ శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.