- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం... ఆలయాల్లో స్పెషల్ అధికారులు !
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ( Andhra Pradesh) ఉన్న దేవాలయాల ( Temples ) విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది చంద్రబాబు

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ( Andhra Pradesh) ఉన్న దేవాలయాల ( Temples ) విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది చంద్రబాబు నాయుడు ( Chandrabbu naidu) కూటమి ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆలయాలలో తనిఖీల కోసం ప్రత్యేకంగా అధికారులు ( Special officers) రంగంలోకి దిగబోతున్నారు. రాష్ట్రంలో ముఖ్యంగా సింహాచలం, అన్నవరం, బెజవాడ కనకదుర్గమ్మ ( Kanakadurgamma), వాడపల్లి, ద్వారకాతిరుమల లాంటి మొత్తం 22 ప్రధాన ఆలయాలలో.. నిత్యం తనిఖీలు చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం.
ఈ 22 ప్రధాన ఆలయాలలో తరచూ తనిఖీలు చేసేందుకు ప్రత్యేకంగా అధికారులను నియమించింది. ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. దేవాలయాలలో క్యూ లైన్ ల ఏర్పాటు, దర్శనాలు, ప్రసాదాల నాణ్యత, తాగునీటి సౌకర్యాలు, ఆలయ పరిశుభ్రత లాంటి విషయాలను ఈ అధికారులు నిత్యం పర్యవేక్షిస్తారన్నమాట.
ఎలాంటి లోపాలు ఉన్నా.... ఈ అధికారులు గుర్తించి... ప్రత్యేక నివేదిక ప్రభుత్వానికి ఇస్తుందని తెలుస్తోంది. దానికి తగ్గట్టుగానే ప్రభుత్వం చర్యలు తీసుకొని.. భక్తులకు ఎలాంటి సమస్యలు లేకుండా చేయనుంది. ఈ మధ్య కాలంలో ఏపీలో ఉన్న ఆలయాలలో చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే భక్తులు కూడా ఇబ్బందులు పడుతున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రత్యేకంగా అధికారులను నియమించింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం.






