- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుపతిలో 822 గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వ.. అధికారుల దాడుల్లో కీలక విషయాలు
గ్యాస్ కొరతను అక్రమార్కులు క్యాష్ చేసుకుంటున్నారు. ఇరాన్ యుద్ధం కారణంగా వంట సిలిండర్లు దొరక్కడం కష్టంగా మారిన విషయం తెలిసిందే. అయితే కొందరు అక్రమార్కులు వందల కొద్ది సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలించేందుకు గోదాముల్లో నిల్వ ఉంచుకుంటున్నారు. ....

దిశ, వెబ్ డెస్క్: గ్యాస్ కొరతను అక్రమార్కులు క్యాష్ చేసుకుంటున్నారు. ఇరాన్ యుద్ధం కారణంగా వంట సిలిండర్లు దొరక్కడం కష్టంగా మారిన విషయం తెలిసిందే. అయితే కొందరు అక్రమార్కులు వందల కొద్ది సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలించేందుకు గోదాముల్లో నిల్వ ఉంచుకుంటున్నారు. సీక్రెట్‌గా అమ్ముకుంటూ డబ్బులు దండుకుంటున్నారు.
తిరుపతిలో గ్యాస్ నిల్వల కలకలం
తాజాగా తిరుపతిలో జరిగిన ఘటన ఒక్కసారిగా కలకలం రేగింది. తిరుపతి శివారు ప్రాంతం అవిలాల పంచాయతిలో గో గ్యాస్ పేరుతో 822 సిలిండర్లను అక్రమంగా నిల్వ ఉంచారు. ఈ కంపెనీకి 2019 నుంచి అనుమతులు లేకపోయినా అక్రమంగా తిరుమలకు సిలిండర్లను సరఫరా చేస్తున్నారు. సివిల్ సప్లై అధికారులు చేసిన దాడుల్లో ఈ విషయాలన్ని బయటకు వచ్చాయి. దీంతో గో గ్యాస్ నిర్వాహకులను అధికారులు అరెస్ట్ చేశారు. గోదాములో అక్రమంగా నిల్వ ఉంచిన 400 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. గ్యాస్ కొరత ఉన్న సమయంలో సిలిండర్లను నిల్వ ఉంచడంతో పెద్ద మొత్తంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.






