ఆదాయానికి మించి ఆస్తులు.. విద్యుత్ శాఖ డీఈ ఇంట్లో సోదాలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-02 17:06:07  IST  )

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ విద్యుత్ శాఖ డీఈ రవికాంత్ ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి...

ఆదాయానికి మించి ఆస్తులు.. విద్యుత్ శాఖ డీఈ ఇంట్లో సోదాలు
X

దిశ, వెబ్ డెస్క్: నంద్యాల జిల్లా(Nandyala District) ఆళ్లగడ్డ విద్యుత్ శాఖ డీఈ రవికాంత్(Allagadda Electricity Department DE Ravikant) ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాదు గత నెలలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఆయన చిక్కారు. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన ఇళ్లలో అధికారులు సోదాలు నిర్వహించారు. నంద్యాలతో పాటు ఆళ్లగడ్డ, బెంగళూరు సహా మొత్తం 17 చోట్ల ఏకకాలంలో సోదాలు కొనసాగించారు. పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సోదాలు ఇంకా గురువారం కూడా కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఏసీబీ అధికారుల అదుపులోనే రవికాంత్‌ ఉన్నట్లు సమాచారం.

Next Story