- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెద్దపులి జాడ కోసం అధికారుల గాలింపు
పులిని పట్టుకోవడానికి బోన్లు ఏర్పాటు చేసే దిశగా అటవీ శాఖ అధికారులు అడుగులు వేస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : రాజమహేంద్రవరం (Rajamahendravaram) పరిసర ప్రాంతాల్లో పెద్దపులి (Peddapuli) సంచారం స్థానిక ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గత కొన్ని రోజులుగా ఏలూరు జిల్లాలో కలకలం రేపిన ఈ పులి (Tiger), ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలంలోని తొర్రేడు (Torredu) గ్రామ సమీపంలోకి ప్రవేశించింది. ఆదివారం తెల్లవారుజామున తొర్రేడు శివారులోని పశువుల పాకపై పెద్దపులి దాడి చేసింది. ఈ దాడిలో రెండు ఆవులను, ఒక లేగదూడను పులి హతమార్చడం స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో తొర్రేడు - వెంకటనగరం (Torredu-Venkatanagaram) మధ్య ఉన్న మొక్కజొన్న, అరటి తోటల్లోనే పులి మాటు వేసి ఉన్నట్లు అటవీ అధికారులు అనుమానిస్తున్నారు.
ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు పొలాల్లో పులి అడుగు జాడలను సేకరించి, అది పెద్దపులి అని ప్రాథమికంగా నిర్ధారించారు. పులి కదలికలను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించడమే కాకుండా, పశువుల కాపరులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. పొలాల వైపు ఒంటరిగా వెళ్లవద్దని, రాత్రి సమయాల్లో బయటకు రావద్దని అధికారులు సూచించారు. భయాందోళనల నేపథ్యంలో స్థానిక పాఠశాలలకు సెలవు ప్రకటించారు. పులిని పట్టుకోవడానికి బోన్లు ఏర్పాటు చేసే దిశగా అటవీ శాఖ అధికారులు అడుగులు వేస్తున్నారు.





