రాష్ట్రానికి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్

by Vemula.Srinu Prasad |

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు....

రాష్ట్రానికి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్
X

దిశ, వెబ్ డెస్క్: ఆగ్నేయ బంగాళాఖాతం(Southeast Bay of Bengal)లో ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడిందని, ఇది మంగళవారానికి అల్పపీడనం(low pressure)గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు(Meteorological Department Officials) తెలిపారు. అంతేకాదు అల్పపీడనం ఏర్పడిన తర్వాత అది 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించారు. ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందని చెప్పారు. బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పచ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల సహా పలు జిల్లాల్లో ఈ రోజు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు చెట్ల కిందకు వెళ్లొద్దని, మత్య్సకారులు సముద్రంలోకి వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

Next Story