- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ap: రాష్ట్రంలో 51 కరువు మండలాలు గుర్తింపు
రాష్ట్రంలో 51 కరువు మండలాలు(Drought zones) ఉన్నట్లు అధికారులు గుర్తించారు...

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో 51 కరువు మండలాలు(Drought zones) ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తీవ్ర ఎండలు, వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కరువు మండలాలను గుర్తించాలని అధికారులను ప్రభుత్వం అదేశించింది. ఆయా మండలాల్లో పర్యటించిన అధికారులు కరువు పరిస్థితులను అధ్యయనం చేశారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 51 మండలాల్లో కరువు ఉన్నట్లు అంచనా వేశారు. సాంకేతికత ఆధారంగా కరువు మండలాలపై కలెక్టర్లు నివేదికలు తయారు చేశారు. అనంతరం ప్రభుత్వానికి అందజేశారు. దీంతో కరువు మండలాలపై ప్రభుత్వం త్వరలోనే జాబితాను విడుదల చేయనుంది.
కాగా ఈ సంవత్సరం రబీలో లోటు వర్షపాతం నమోదు అయింది. సరైన సమయంలో వర్షాలు పడలేదు. పంటల దిగుబడులు సైతం చాలా తగ్గిపోయాయి. రబీ సీజన్ ముగిసిన నేపథ్యంలో కరువు పరిస్థితులపై అధికారులను ప్రభుత్వం నివేదికలు కోరింది. పంటల సాగు విస్తీర్ణం, దిగుబడి, వర్షపాతం నమోదు, భూమిలో తేమశాతం, భూగర్భజలాల పరిస్థితి వంటి కేంద్రప్రభుత్వ మార్గదర్శకాల అనుగుణంగా కరువు మండలాలను అధికారులు ఎంపిక చేశారు. మొత్తం 51 మండలాల్లో కరువు పరిస్థితులు ఉన్నట్లు నివేదికలు రెడీ చేసి ప్రభుత్వానికి అందజేశారు.






