మూడు గంటల్లో పిడుగులతో భారీ వర్షం.. ఉత్తరాంధ్రకు బిగ్ అలర్ట్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-10-01 08:36:22  IST  )

ఉత్తరాంధ్రకు విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు పిడుగులతో కూడిన భారీ వర్షం పడుతుందని హెచ్చరించారు..

మూడు గంటల్లో పిడుగులతో భారీ వర్షం.. ఉత్తరాంధ్రకు బిగ్ అలర్ట్
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరాంధ్ర(Uttarandhra)కు విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు పిడుగులతో కూడిన భారీ వర్షం పడుతుందని హెచ్చరించారు. అదికూడా మరో మూడు గంటల్లో ఉండొచ్చని అంచనా వేసి తెలిపారు. శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, అల్లూరి, అనకాపల్లి జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని, అలాగే ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని తెలిపారు. రైతులు, సామన్య జనం చెట్ల కింద నిలబడరాదని సూచించారు. వర్షాలు ముగిసే వరకూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.

Next Story