సత్తెనపల్లిలో నర్సు ఆత్మహత్య.. కలకలం

by Vemula.Srinu Prasad |

పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని వావిలాల నగర్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రి నర్సు బలవన్మరణానికి పాల్పడ్డారు..

సత్తెనపల్లిలో నర్సు ఆత్మహత్య.. కలకలం
X

దిశ, సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని వావిలాల నగర్ లో ఓ ప్రైవేట్ ఆస్పత్రి నర్సు బలవన్మరణానికి పాల్పడ్డారు. గోవర్థిని (40) ఆదివారం అర్ధరాత్రి తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికంగా ఓ ఆస్పత్రిలో పని చేస్తున్న ఆమె మృతి కాలనీలో కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఆస్పత్రిలో గొడవ జరిగిందని, డాక్టర్ కొట్టారని ఆమె కొడుకు ఆరోపిస్తున్నారు.

Next Story