- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Chandrababu: వ్యవసాయ రంగంలో ఏపీ నంబర్‌వన్
వ్యవసాయ రంగంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఏపీ ఉందని, పరిశ్రమలు కూడా వస్తే రాష్ట్రానికి ఆదాయం సమకూరి ఉపాధి పెరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

పరిశ్రమలు వస్తే ఉపాధి పెరుగుతుంది
నిత్య విద్యార్థిలా ఎల్లప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటా
సాంకేతిక యుగంలో సమర్థత అవసరం
ప్రతి కుటుంబం నుంచి పారిశ్రామికవేత్త రావాలి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
దిశ, డైనమిక్ బ్యూరో : వ్యవసాయ రంగంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఏపీ ఉందని, పరిశ్రమలు కూడా వస్తే రాష్ట్రానికి ఆదాయం సమకూరి ఉపాధి పెరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలోని పశు సంవర్థకక శాఖ టెక్ ఏఐ2.0 కాంక్లేవ్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన 'పాత్ వేస్ టు ప్రాస్పెరిటీ', నెక్స్ట్- జెన్ యానిమల్ హస్బెండ్రీ', 'విజనరీ' అనే మూడు పుస్తకాలను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఆధునిక సాంకేతికత, ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పశుసంవర్థక విభాగంలో సమ్మిళిత, స్థిరమైన వృద్ధి, భవిష్యత్ ప్రణాళికలు, పేదరిక నిర్మూలన వంటి వాటిపై రాసిన ఈ పుస్తకాలు ఉపయోగపడతాయ న్నారు.
సాంకేతికత ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉందని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులు ఉన్నారని, వారిలో తెలుగు వాళ్లే అధికమన్నారు. ప్రపంచంలో యువత ఎక్కువగా ఉండేది భారత్ లోనే నని చెప్పారు. గతంలో ఏ పని చేయాలన్న ప్రభుత్వం అనుమతి అవసరమన్నారు. 1991లో ఆర్థిక సంస్కరణలు రాగానే మార్పులు వచ్చాయని తెలిపారు. అప్పుడప్పుడే వస్తున్న ఐటీని సద్వినియోగం తీసుకున్నామని తెలిపారు. అప్పుడే వచ్చిన ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏ పనులైన సులువుగా చేసుకుని పరిస్థితి వచ్చిందని తెలిపారు. గతంలో రోడ్లు గుంతలుగా ఉండేవని, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో వాటిని చక్కగా నిర్మించారని వివరించారు. తాను నిత్య విద్యార్థిని అని, ఎల్లప్పుడూ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తానని తెలిపారు.
పేదరికం లేని సమాజమే లక్ష్యం
పేదరికం లేని సమాజమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. సంపద సృష్టించాలి.. ప్రజలకు అందించాలి అనేది తన ధ్యేయమన్నారు. ఇష్టపడి పని చేస్తే కష్టం ఉండదని తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ లో ఇప్పటికే 330 సర్వీసులు ఇస్తున్నామని, మరి కొద్ది రోజుల్లో 400కు పెంచుతామని వెల్లడించారు రెండు మూడు నెలల్లో వాట్సప్ గవర్నన్స్పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకొస్తామని తెలిపారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త ఎదగాలని పిలుపునిచ్చారు. అందుకే రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. దేశంలో మైక్రో ఇరిగేషన్ కు ఆంధ్రప్రదేశ్ చిరునామా కావాలని ఆకాంక్షించారు. సాంకేతిక యుగంలో సమర్థత పెంచుకోవాలని చంద్రబాబు సూచించారు






