‘సంక్షేమాన్ని ప‌రిచయం చేసింది ఎన్టీఆర్’.. మంత్రి నిమ్మల కీలక వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |

రాష్ట్రంలో ఇరిగేషన్ వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడంతో పాటు రాయలసీమ ప్రాంతానికి తాగు, సాగునీరు అందించిన మహానుభావుడు ఎన్టీఆర్ అని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala Ramanaidu) అన్నారు

‘సంక్షేమాన్ని ప‌రిచయం చేసింది ఎన్టీఆర్’.. మంత్రి నిమ్మల కీలక వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఇరిగేషన్ వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడంతో పాటు రాయలసీమ ప్రాంతానికి తాగు, సాగునీరు అందించిన మహానుభావుడు ఎన్టీఆర్ అని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala Ramanaidu) అన్నారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ.. ఎన్టీఆర్(Sr.NTR) ఆశయ సాధనకు అనుగుణంగా నేడు సీఎం చంద్రబాబు(CM Chandrababu) సంక్షేమం, అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తూ పరిపాలన సాగిస్తున్నారని తెలిపారు. తెలుగు జాతికి గుర్తింపు, గౌర‌వం తీసుకొచ్చింది ఎన్టీఆర్ అన్నారు. టీడీపీ(TDP) ఆవిర్భ‌వించ‌కముందు తెలుగువారంటే ఒక సాంబారీలు, మ‌ద్రాసీలు అని పిలిచేరోజుల్లో తెలుగువారి ఆత్మ‌గౌర‌వాన్ని ఢిల్లీ న‌డివీధుల్లోనే కాదు, ప్ర‌పంచ వ్యాప్తంగా చాటిచెప్పిన మ‌హ‌నీయుడు ఎన్టీరామారావు అని కొనియాడారు. నాడు రాజ‌కీయాలంటే ఫ్యాక్ష‌నిస్టులు, వ్యాపార‌వేత్త‌లు, క్యాప్ట‌లిస్టులు, భూస్వాముల చేతుల్లో ఉంటే, రాజ‌కీయం అంటే సామాన్యుడికి తెలియ‌జెప్పిన వ్య‌క్తి అన్న ఎన్టీఆర్ అన్నారు.

భారత‌దేశంలో ఎక్క‌డ ఏ రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌రిగినా, ఇప్పుడు కూడా ఢిల్లీ ఎన్నిక‌ల్లో అటు బీజేపీ, ఇటు ఆప్ పార్టీలు త‌మ మ్యానిఫెస్టోలో సంక్షేమ ప‌థకాలు ప్ర‌క‌టిస్తున్నాయి అంటే, అస‌లు సంక్షేమ‌ము అంటే ఏంటో తెలియ‌ని రోజుల్లోనే దేశానికి సంక్షేమాన్ని ప‌రిచయం చేసింది ఎన్టీఆర్ అన్నారు. నాడు కిలో రెండు రూపాయ‌ల‌కే బియ్యం , చీర, దోహాతి , ప‌క్కా గృహాలు , వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు 35 రూపాయలు పెన్షన్ వంటి పథకాలు తొలిగా అమలు చేసింది ఎన్టీఆర్ అన్నారు. బ‌ల‌హీన వ‌ర్గలు రాజ‌కీయంగా ముందుకు రావాల‌నే ఆలోచ‌న‌తో దేశ చ‌రిత్ర‌లోనే మొద‌టి సారిగా స్దానిక సంస్ద‌ల ఎన్నిక‌ల్లో 34శాతం రిజ‌ర్వేష‌న్లు, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు వంటివి తీసుకొచ్చారన్నారు. ప‌రిపాల‌నను ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర‌కు తీసుకురావాల‌నే ఉద్దేశ్యంతో మునుసుబు, కరణం, తాలూకా వ్య‌వ‌స్ద‌ను ర‌ద్దు చేసి, మండ‌ల వ్య‌వ‌స్ద‌ను తీసుకొచ్చారన్నారు. నేడు ఎన్టీఆర్ భౌతికంగా లేకపోయినా భూమి మీద తెలుగు వారు ఉన్నంత‌కాలం అందరి హృదయాల్లో చిర‌స్దాయిగా నిలిచిపోతార‌ని మంత్రి రామానాయుడు తెలిపారు.

Next Story