- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP News:ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
నీట్ కౌన్సిలింగ్-2022లో అర్హురాలైన విద్యార్థినికి ఎంబీబీఎస్ సీటు నిరాకరించినందుకు రూ.7 లక్షల పరిహారం చెల్లించాలని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.

దిశ,వెబ్‌డెస్క్: నీట్ కౌన్సిలింగ్-2022లో అర్హురాలైన విద్యార్థినికి ఎంబీబీఎస్ సీటు నిరాకరించినందుకు రూ.7 లక్షల పరిహారం చెల్లించాలని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. వైద్య విద్యలో ప్రవేశాల కోసం 2022 వ సంవత్సరంలో నీట్ ఎగ్జామ్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నీట్ రాసిన నెల్లూరుకు చెందిన రేవూరు వెంకట ఆశ్రిత అనే విద్యార్థిని NCC ఓపెన్ మహిళా కేటగిరీ కింద MBBS లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్నారు.
కానీ ఆమెకు సీటు రాకపోవడంతో నిరాశకు గురైంది. అయితే.. NCCలో తనకంటే తక్కువ మెరిట్, నీట్‌లో తక్కువ మార్కులు వచ్చిన మరో విద్యార్థినికి నెల్లూరులోని నారాయణ మెడికల్ కళాశాలలో సీటు కేటాయించడంతో విద్యార్థిని హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కేసును విచారించిన ఏపీ హైకోర్టు(AP High Court) ఆశ్రిత కంటే తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థినికి సీటు కేటాయించడం చట్టవిరుద్ధమని ఈ ఏడాది ఫిబ్రవరి 20న తేల్చి చెప్పింది. అలాగే, వర్సిటీ అధికారులు చర్యలతో MBBS సీటు కోల్పోయి డెంటల్ కోర్సులో చేరిన ఆశ్రితకు నష్టపరిహారంగా రూ.7 లక్షలు చెల్లించాలని వైద్య విశ్వవిద్యాలయానికి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కానీ, ఈ తీర్పును సవాల్ చేస్తూ ఈ ఏడాది మార్చి 6న ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం(NTR Medical University) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం అప్పీల్‌లో జోక్యం చేసుకోవడానికి ఎటువంటి కారణాలు కనిపించడం లేదని తెలిపింది. న్యాయమూర్తులు జస్టీస్ ఎంఎం సుందరేష్, జస్టీస్ రాజేష్ బిందల్ ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.






