- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్టీఆర్ తనదైన ముద్ర వేశారు : ఎమ్మెల్యే బాలకృష్ణ
మహానుభావులు కావాలంటే ఎంతో శ్రమ.. దీక్ష అవసరం.

దిశ, వెబ్ డెస్క్ : మహానుభావులు కావాలంటే ఎంతో శ్రమ.. దీక్ష అవసరం అని.. అవి ఎన్టీఆర్ లో పుష్కలంగా ఉండేవని ఎన్టీఆర్ తనయుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ తనదైన ముద్ర వేశారన్నారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆయన బ్రతికే ఉంటారన్నారు. సినిమాల్లో ఎవరూ చేయని విభిన్న పాత్రల్లో నటించారని.. ప్రతి పాత్రలోనూ పరకాయ ప్రవేశం చేశారని తెలిపారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే మాటను విశ్వసించి టీడీపీని స్థాపించారన్నారు. తద్వారా కొందరికే పరిమితమైన రాజకీయాలను అన్ని వర్గాల వారికి చేరువ చేశారన్నారు. బడుగు, బలహీనవర్గాల వారికి చేయూతనిచ్చారని కొనియాడారు. ఆకలి తెలిసిన నాయకుడని కొనియాడారు. ప్రతి తెలుగువాడు గర్వించేలా తెలుగువారి కీర్తిని ప్రపంచానికి చాటారన్నారు. నాడు ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ తీసుకొచ్చిన పథకాలే నేడు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్నాయని చెప్పారు. ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఆయన స్ఫూర్తిని టీడీపీ కొనసాగిస్తుందని ప్రకటించారు.
Read More..






