ఎన్టీఆర్ చివరి కోరిక అదే.. ఏపీకి మళ్లీ మంచి రోజులు వస్తాయ్.. లక్ష్మీపార్వతి షాకింగ్ కామెంట్స్

by Ajay Maddhiboyina |   (  Updated:2026-01-18 05:14:39  IST  )

నందమూరి తారక రామారావు వర్థంతి సందర్భంగా ఆయన రెండో భార్య లక్ష్మీ పార్వతి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నేళ్లు గడిచినా మహనీయులు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతారని చెప్పడానికి ఎన్టీఆర్ సాక్ష్యం అన్నారు.

ఎన్టీఆర్ చివరి కోరిక అదే.. ఏపీకి మళ్లీ మంచి రోజులు వస్తాయ్.. లక్ష్మీపార్వతి షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: నందమూరి తారక రామారావు వర్థంతి సందర్భంగా ఆయన రెండో భార్య లక్ష్మీ పార్వతి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నేళ్లు గడిచినా మహనీయులు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతారని చెప్పడానికి ఎన్టీఆర్ సాక్ష్యం అన్నారు. ఊరికే మహానుభావులు కాలేదని వాళ్ళు చేసిన మంచి పనుల వల్లనే మహానుభావులు అయ్యారని అన్నారు. ఎన్టీఆర్ కు మరణంల లేదని చెప్పారు. నమ్ముకున్న ఆశయం కోసం, తనను నమ్ముకున్న స్త్రీ కోసం పదవిని కూడా వదిలేయడానికి సిద్ధపడ్డారని అన్నారు. వెన్నుపోటు రాజకీయాలకు ఆయన తలవంచకుండా తన ఆశయాన్నికొనసాగిస్తానని చెప్పేవారన్నారు.

అంతే కాకుండా సింహం ఎప్పుడూ పచ్చగడ్డితినదు.. సింహం ఎప్పుడూ పోరాడి సాధించుకుంటుందని ఎన్టీఆర్ చెప్పేవారన్నారు. తాను కూడా వెన్నుపోటుదారులపై యుద్ధం చేసి పదవిని దక్కించుకుంటానని చెప్పేవారన్నారు. కానీ ఆయన శపతం నెరవేరకముందే కన్నుమూయాల్సి వచ్చిందన్నారు. ఎన్టీఆర్ ఆశయాన్ని నెరవేర్చేవాళ్లు చాలా మంది వస్తున్నారని చెప్పారు. ఎన్టీఆర్ చివరికోరిక సగం తీరిందని, కొన్నిసార్లు కారు మబ్బులు వస్తాయని అన్నారు. మళ్లీ ఆంధ్రప్రదేశ్ కు మంచిరోజులు రావాలని కోరుకుంటున్నామన్నారు. ఎన్టీఆర్ కు భారతరత్నం ఇవ్వడంపై డ్రామా జరుగుతుందన్నారు. మాజీ సీఎం జగన్ ఓ జిల్లాకే ఎన్టీఆర్ పేరు పెట్టారని చంద్రబాబు అన్నిసార్లు సీఎం అయినా పెట్టలేదన్నారు.

Read More..

ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో బతికే ఉన్నారు: దగ్గుబాటి పురందేశ్వరి

Next Story