NTR : ఇకపై ప్రభుత్వ అధికారిక వేడుకగా NTR జయంతి.. ఉత్తర్వులు విడుదల

by Muthe.Rajitha |

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Govt) మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది.

NTR : ఇకపై ప్రభుత్వ అధికారిక వేడుకగా NTR జయంతి.. ఉత్తర్వులు విడుదల
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Govt) మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. టీడీపీ వ్యవస్థాపకుడు(TDP Founder), మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి(NTR's birth Anniversary) మే 28ని ఇకపై ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వేడుక(Official State Govt Ceremony)గా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల విభాగాధిపతులకు, అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వేడుకల్లో ఎన్టీఆర్ సేవలను గుర్తుచేసుకోవడం, ఆయన చేసిన రాజకీయ, సామాజిక సంస్కరణలను ప్రజలకు వివరించడం జరుగుతుంది. ఎన్టీఆర్ జయంతిని అధికారికంగా గుర్తించి, ఆయన స్ఫూర్తిని కొనసాగించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు.

Next Story