చంద్రబాబుని పట్టించుకోని ఎన్టీఆర్.. టీడీపీ ఫ్యూచర్ దబిడి దిబిడే.. పాలిటిక్స్‌లో వైరల్ అవుతున్న ట్వీట్

by Disha Web Desk 7 |
చంద్రబాబుని పట్టించుకోని ఎన్టీఆర్.. టీడీపీ ఫ్యూచర్ దబిడి దిబిడే.. పాలిటిక్స్‌లో వైరల్ అవుతున్న ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ వర్గాలు, కొందరు సినీ ప్రముఖులు, నందమూరి ఫ్యామిలీ స్పందించారు. కానీ ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ మాత్రం స్పందించలేదు. ఈ క్రమంలోనే చంద్రబాబు అరెస్ట్ నుంచి రకరకాల ట్వీట్స్ పెడుతూ రెచ్చిపోతున్న వర్మ.. ఇప్పుడు ఎన్టీఆర్ చంద్రబాబు అరెస్ట్‌ను పట్టించుకోవడం లేదని అర్ధమవుతోందంటూ సంచలన ట్వీట్ పెట్టాడు. ఈ మేరకు ‘‘చంద్రబాబు అరెస్ట్‌ని జూనియర్ ఎన్టీఆర్ కనీసం ఖండించలేదు. దీన్ని బట్టి టీడీపీ ఫ్యూచర్ దబిడి దిబిడే’’ అంటూ కాంట్రవర్సియల్ ట్వీట్ షేర్ చేశాడు వర్మ. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెట్టింట వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య కామెంట్ల వార్ స్టార్ అయింది.

Next Story

Most Viewed