Collector: ఏదైనా ప్రమాదం ఉంటే ముందే హెచ్చరిస్తాం.. పుకార్లు నమ్మొద్దు

by Gantepaka Srikanth |

ఏపీ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో వరదలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

Collector: ఏదైనా ప్రమాదం ఉంటే ముందే హెచ్చరిస్తాం.. పుకార్లు నమ్మొద్దు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో వరదలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలోనే విజయవాడలోని బుడమేరు(Budameru)లో రెండు రోజులుగా పెరుగుతున్న నీటి మట్టం.. స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో పలువురు బుడమేరు లక్ష్యంగా చేసుకుని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని స్థానిక కలెక్టర్(NTR District Collector) ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బుడమేరుపై పుకార్లు నమ్మొద్దు. వెలగలేరు రెగ్యులేటర్‌ దగ్గర సాధారణ పరిస్థితులు. బుడమేరుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏదైనా ప్రమాదం ఉంటే ముందే హెచ్చరిస్తాం’ అని కలెక్టర్‌ అలర్ట్ చేశారు. గత ఏడాది సెప్టెంబరు మొదటి వారంలో వచ్చిన వరద.. 10 రోజుల పాటు స్థానికులకు కంటి మీద కునుకులేకుండా చేసింది. వర్షాలు కురవకపోయినా బుడమేరులో నీరు రావడం, వరద వస్తుందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరగడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఆయా ప్రాంతాలను నగరపాలకసంస్థ అధికారులు పరిశీలించారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని ప్రజలకు సూచనలు చేశారు.

Next Story