- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ సర్కార్ మరో శుభవార్త...త్వరలోనే ఎన్టీఆర్ బేబీ కిట్లు !
ప్రసవించే తల్లులకు గుడ్ న్యూస్ చెప్పింది కూటమి సర్కార్. ఎన్టీఆర్ బేబీ కిట్లు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం తాజాగా నిర్ణయం

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవించే తల్లులకు గుడ్ న్యూస్ చెప్పింది కూటమి సర్కార్. ఎన్టీఆర్ బేబీ కిట్లు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి జూన్ మాసంలోనే ఈ ప్రక్రియ మొదలయ్యేది. కానీ వాయిదా పడింది. కిట్ లో అదనంగా మడిచే బెడ్, బ్యాగ్ చేర్చాలని సీఎం చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. దీంతో ముందుగా ఖరారు అయిన టెండర్ రద్దయింది. ఇక సెప్టెంబర్ మాసంలో రెండోసారి కూడా టెండర్లను పిలిచారు. మూడు జోన్లలో వేరు వేరు సంస్థలకు కిట్ల సరఫరా బాధ్యతలు అప్పగించింది కూటమి ప్రభుత్వం.
ఇక ఇప్పుడు 13 వస్తువులతో ఎన్టీఆర్ బేబీ కిట్లు సరఫరా చేసేందుకు సిద్ధం అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సుమారు 3.50 లక్షల మందికి బేబీ కిట్లు అందించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తోంది ప్రభుత్వం. ఇక ఈ కిట్ లో బ్యాగ్, దోమలతెరతో కూడిన పరుపు ఉంటుంది. మడిచే బెడ్, రెండు సబ్బులు, ఆయిల్, రెండు టవల్స్, రెండు దుస్తులు, వాటర్ ప్రూఫ్ షీట్, సబ్బు పెట్టే, పౌడర్, బొమ్మ, 6 నాప్కిన్లు ఇలా 13 వస్తువులు ఉంటాయి.
ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బాలింత డిశ్చార్జ్ అయ్యే సమయంలో ఈ కిట్ అందించాలన్నది లక్ష్యం. 2016 సంవత్సరంలోనే తెలుగుదేశం ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టి విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లింది. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ పథకాన్ని కొన్ని రోజులు అమలు చేసి ఆ తర్వాత ఆపేశారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ బేబీ కిట్ పేరుతో పథకాన్ని పునః ప్రారంభించనున్నారు.






