- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
NTR: అన్న ఎన్టీఆర్ AI వాయిస్.. కడపకు తరలిరావాలని పిలుపు
‘తెలుగుదేశం పార్టీ మహా వేడుక మహానాడుని ప్రారంభించిన మహా నాయకుడు అన్న ఎన్టీఆర్.. ఆహ్వానం అందుకోండి..

దిశ, డైనమిక్ బ్యూరో : ‘తెలుగుదేశం పార్టీ (Telugudesam party) మహా వేడుక మహానాడుని (Mahanadu)ప్రారంభించిన మహా నాయకుడు అన్న ఎన్టీఆర్.. ఆహ్వానం అందుకోండి.. కడపలో మహానాడుకు తరలిరండి..’ అంటూ తెలుగుదేశం పార్టీ తన ఎక్స్‌ఖాతాలో ఓ పోస్టు చేసింది. ఈ పోస్టులో నందమూరి తారకరామారావు వాయిస్‌తో క్రియేట్చేసిన వాయిస్ఉంది.. ‘ప్రియమైన నా తెలుగింటి ఆడపడుచులకు, అన్నదమ్ములకు నమస్కారం. తెలుగుజాతిని ఏకం చేయడానికి తెలుగువారిని జాగృతం చేయడానికి నేను ప్రారంభించిన మహానాడు నేడు తెలుగువారి ఐక్యతకు చిహ్నంగా నిలవడం నాకు ఎంతో గర్వంగా ఉంది. 2025 మే 27, 28, 29 తేదీలలో కడప గడ్డపై తొలిసారిగా జరగబోయే మహానాడు వేడుకలకు మీ అందరికీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను.. ’ అంటూఈ వీడియో సాగింది. ఇది ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని కూడా నింపుతోంది.






