బ్రేకింగ్: చంద్రబాబుకు సెక్యూరిటీ పెంచిన NSG.. యర్రగొండపాలెంలో హై టెన్షన్!

by Disha Web Desk 19 |
బ్రేకింగ్: చంద్రబాబుకు సెక్యూరిటీ పెంచిన NSG.. యర్రగొండపాలెంలో హై టెన్షన్!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో హై టెన్షన్ వాతవరణం నెలకొంది. టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు రోడ్ షోను అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు ప్రయత్నం చేయడంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నల్లబెలూన్లు, ప్లకార్డులతో మంత్రి ఆదిమూలపు సురేష్ వర్గీయులు చంద్రబాబుకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. టీడీపీ, వైసీపీ కార్యకర్తల పోటాపోటీగా రోడ్లపైకి రావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ఇదిలా ఉండగా.. చంద్రబాబు మార్కాపురం నుండి యర్రగొండపాలెం బయలుదేరారు. వైసీపీ శ్రేణులు బాబు పర్యటనను అడ్డుకునేందుకు సిద్ధమవడంతో ఎన్‌ఎస్‌జీ అప్రమత్తమైంది. చంద్రబాబు యర్రగొండపాలెం పర్యటనకు ఎన్ఎస్‌జీ అదనపు భద్రతను పెంచింది. మరోపక్కా బాబు పర్యటనను అడ్డుకునేందుకు మంత్రి ఆదిమూలపు సురేష్ కార్యకర్తలతో కలిసి యర్రగొండపాలెం బయలుదేరారు. ఈ క్రమంలో యర్రగొండపాలెంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఇవి కూడా చదవండి: Yuvagalam: గుండు కొట్టి పంపిస్తా.. వైసీపీ కార్యకర్తలకు నారా లోకేశ్ మాస్ వార్నింగ్


Next Story

Most Viewed