AP: బిగ్ రిలీఫ్‌...ఇక‌పై బుక్ చేసిన 2-3 రోజుల్లో సిలిండర్ డెలివరీ !

by velandi.Saikiran |

బుక్ చేసిన రెండు లేదా మూడు రోజుల్లోనే సిలిండర్ డెలివరీ చేస్తామని పౌరసరఫరాల శాఖ కీలక ప్రకటన చేసింది.

AP: బిగ్ రిలీఫ్‌...ఇక‌పై బుక్ చేసిన 2-3 రోజుల్లో సిలిండర్ డెలివరీ !
X

* బుక్ చేసిన రెండు లేదా మూడు రోజుల్లోనే సిలిండర్ డెలివరీ*

*గ్యాస్ పై ఫేక్ ప్ర‌చారం న‌మ్మోద్దు*

*పౌరసరఫరాల శాఖ కీల‌క ప్ర‌క‌ట‌న‌*

దిశ‌, వెబ్ డెస్క్‌: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ రిలీఫ్ దక్కింది. బుక్ చేసిన రెండు లేదా మూడు రోజుల్లోనే సిలిండర్ డెలివరీ చేస్తామని పౌరసరఫరాల శాఖ కీలక ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రిఫైనరీలలో ప్రస్తుతం 14, 000 టన్నుల LPG నిల్వ‌లు ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ తరుణంలో ఆన్లైన్ లో గ్యాస్ బుక్ చేస్తే, రెండు లేదా మూడు రోజుల్లోనే సిలిండర్ హోమ్ డెలివరీ చేస్తామని అధికారిక ప్రకటన చేసింది ఏపీ పౌర సరఫరాల శాఖ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతలేదని క్లారిటీ ఇచ్చింది. కొంతమంది ఫేక్ ప్రచారం చేస్తున్నారని, అలాంటి వదంతులు అస్సలు నమ్మి మోసపోకూడదని పేర్కొంది.

ఫేక్ ప్ర‌చారం న‌మ్మోద్దు - పౌరసరఫరాల శాఖ

గ్యాస్ కొరత ఉందని హడావిడిగా బుకింగ్స్ చేయకూడదని కూడా సూచనలు చేసింది. గందరగోళంగా సిలిండర్ కోసం గ్యాస్ ఏజెన్సీలకు వెళ్ళకూడదని కూడా కోరింది ఏపీ పౌరసరఫరాల శాఖ. గ్యాస్ స‌ర‌ఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. ఇకపై గ్యాస్ విషయంలో ఏపీ ప్రజలు ఆందోళన చెంద‌వద్దని వెల్లడించింది. దీంతో ఏపీ ప్రజలకు రిలీఫ్ దక్కింది. కాగా, ప‌శ్చిమాసియా దేశాల‌లో ఉద్రిక‌త్త‌లు, హ‌ర్మూజ్ జ‌ల‌సంధి ద‌గ్గ‌ర ఆంక్ష‌ల కార‌ణంగా మొన్న‌టి వ‌ర‌కు చ‌మురు కొర‌త ఏర్ప‌డింది. అయితే, ఇండియాపై ఇరాన్ ఎలాంటి ఆంక్ష‌లు పెట్ట‌లేదు. దీంతో ఇండియాకు రావాల్సిన నౌక‌లు వ‌స్తూనే ఉన్నాయి.

Next Story