మాజీ మంత్రి విడదల రజినికి నోటీసులు

by Ajay Maddhiboyina |

వైసీపీకి మ‌రో షాక్ త‌గిలింది. ఆ పార్టీ మాజీ మంత్రి విడద‌ల ర‌జినికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రెంట‌పాళ్ల ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా రజిని నిబంధ‌న‌లు ఉల్లంగించి జ‌న‌స‌మీక‌ర‌ణ

మాజీ మంత్రి విడదల రజినికి నోటీసులు
X

దిశ‌, వెబ్ డెస్క్: వైసీపీకి మ‌రో షాక్ త‌గిలింది. ఆ పార్టీ మాజీ మంత్రి విడద‌ల ర‌జినికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రెంట‌పాళ్ల ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా రజిని నిబంధ‌న‌లు ఉల్లంగించి జ‌న‌స‌మీక‌ర‌ణ చేయ‌డంపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఈ కేసులోనే ఆమెకు నోటీసులు అంద‌జేశారు. ఈ నెల 20న విచార‌ణ‌కు హాజ‌ర‌వ్వాల‌ని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే వైసీపీ మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేల‌పై వ‌రుస కేసులు న‌మోద‌వుతున్నాయి. ఇప్పటికే కొంద‌రు జైలుకు కూడా వెళ్లి వ‌చ్చారు. మ‌రికొంద‌రు ర‌క‌ర‌కాల కేసుల్లో విచార‌ణ ఎదుర్కొంటున్నారు. ఈ క్ర‌మంలో రజినికి కూడా నోటీసులు ఇవ్వ‌డంతో ఆ పార్టీకి ఊహించ‌ని షాక్ త‌గిలింది.

Next Story