ప్రముఖ సాహితీవేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఎల్.ఆర్.స్వామి కన్నుమూత

by Ramesh Naini |

ప్రముఖ సాహితీవేత్త, సుప్రసిద్ధ అనువాదకుడు లక్ష్మణయ్యర్ రామస్వామి (ఎల్.ఆర్.స్వామి) ఇవాళ ఉదయం విశాఖపట్నంలో కన్నుమూశారు.

ప్రముఖ సాహితీవేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఎల్.ఆర్.స్వామి కన్నుమూత
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ సాహితీవేత్త, సుప్రసిద్ధ అనువాదకుడు లక్ష్మణయ్యర్ రామస్వామి (ఎల్.ఆర్.స్వామి) ఇవాళ ఉదయం విశాఖపట్నంలో కన్నుమూశారు. ఆయన మృతి సాహితీ లోకానికి తీరని లోటుగా మిగిలింది.

రేపు ఉదయం అంతిమయాత్ర..

రేపు ఉదయం 10 గంటలకు విశాఖలోని విశాలాక్షి నగర్‌లో ఉన్న ఆయన కుమార్తె నివాసం నుంచి అంతిమయాత్ర నిర్వహించనున్నారు. ఎల్.ఆర్.స్వామి భౌతికకాయాన్ని సందర్శించి, మార్క్సిస్ట్ అధ్యయన కేంద్రం కన్వీనర్ జేవీ సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే మానం ఆంజనేయులు తదితరులు ఘనంగా నివాళులర్పించారు.

సాహితీ ప్రస్థానం, పురస్కారాలు..

1944 అక్టోబరు 16న కేరళలోని త్రిచూర్‌లో జన్మించిన ఆయన, ఆ తర్వాత కాలంలో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో స్థిరపడ్డారు. మలయాళ సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించడంలో ఎల్.ఆర్.స్వామి విశేష కృషి చేశారు. కే.పీ. రామునుణ్ణి రాసిన మలయాళ నవల ‘సూఫీ పరంజ కథ’ను తెలుగులో ‘సూఫీ చెప్పిన కథ’గా అనువదించి గొప్ప గుర్తింపు పొందారు. ‘ఆరో ఆడపిల్ల’ వంటి రచనలతో మలయాళ సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు చేరువ చేశారు. ‘సూఫీ చెప్పిన కథ’ అనువాదానికి గాను ఆయనకు 2015లో కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం వరించింది.

Next Story