- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirumala News:శ్రీవారి భక్తులకు గమనిక.. ఫిబ్రవరి 12న ప్రత్యేకత ఏంటో తెలుసా!
తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామివారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు.

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామివారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. ఈ క్రమంలో భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటారు. అయితే తిరుమలలో ప్రతి ఏటా ఫిబ్రవరి 12వ తేదీన శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతోంది. శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటికి భక్తులు భారీగా తరలివస్తుంటారు. ఈ పుణ్యతీర్థాలలో సప్త గిరుల్లో వెలసి ఉన్న సప్త తీర్థములు ప్రముఖమైనవి. ఈ తీర్థాలలో స్నానమాచరించి.. భక్తులు పరమ పావనులై ముక్తి మార్గం పొందగలరని నమ్ముతారు. ఈ నేపథ్యంలో రామకృష్ణ తీర్థానికి వెళ్లే భక్తుల కోసం టీటీడీ(TTD) భారీ ఏర్పాట్లు చేస్తోంది.
ఈ క్రమంలో భక్తులకు అన్నప్రసాదాలు, భద్రతా ఏర్పాట్లను పోలీసు, అటవీశాఖ చేపడుతుంది. ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు(RTC Bus) కూడా అందుబాటులో ఉంటాయి. టీటీడీ వైద్యవిభాగం ఆధ్వర్యంలో మెడికాల్ టీమ్(Medical Team)లు ఏర్పాటు చేస్తోంది. ఈ పర్వదినంనాడు శ్రీవారి ఆలయ అర్చకులు మంగళవాయిద్యాలతో ఆలయ మాడ వీధుల్లో పూలు, పండ్లు, స్వామివారి ప్రసాదాలు మొదలగు పూజా సామగ్రిని తీసుకు వెళ్ళి.. శ్రీ రామకృష్ణ తీర్థంలో వెలసివున్న శ్రీరామచంద్ర మూర్తి, శ్రీకృష్ణుని విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించడంతో ‘శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి’ ముగుస్తుందని టీటీడీ ప్రకటనలో తెలిపింది.
‘శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి’ ప్రత్యేకత ఇదే..
*శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ప్రతి ఏటా మకరమాసం నందు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
*ఈ పుణ్యతీర్థము స్వామి వారి ఆలయానికి 6 మైళ్ళ దూరంలో ఉన్నది.
*పుష్యమి నక్షత్రంతో కూడిన పౌర్ణమినాడు ఈ రామకృష్ణ తీర్థ పర్వదినాన్ని ఆలయ అర్చకులు అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.
*పూర్వకాలమున శ్రీరామకృష్ణుడను మహర్షి వేంకటాద్రిపై తపస్సు చేసి, తాను స్నానమాచరించడానికి ఈ తీర్థాన్ని రూపొందించుకున్నాడని స్కంద పురాణం చెబుతోంది.
*ఈ తీర్థ తీరమున నివసించుచూ, స్నానపానాదులు చేయుచూ, శ్రీమహావిష్ణువును గూర్చి కఠోర తపస్సు ఆచరించి విష్ణువు సాక్షాత్కారంతో ముక్తి పొందారు' అని చెబుతారు.
*ఎవరైనా మానవులు అజ్ఞానంతో తల్లిదండ్రులను, గురువులను దూషించినందు వల్ల కలిగినటువంటి దోషము.. ఈ పుణ్యతీర్థమునందు స్నానమాచరించుట వలన ఆ దోషం నుంచి విముక్తి పొంది సుఖంగా జీవించగలరని విశ్వసిస్తారు.






