- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
YSRCP : మెగా డీఎస్సీ కాదు.. మెగా డ్రామా : వైసీపీ
by Muthe.Rajitha |
ఏపీలో ఆదివారం మెగా డీఎస్సీ(AP Mega DSc) నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో ఆదివారం మెగా డీఎస్సీ(AP Mega DSc) నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. దాదాపు 16 వేలకు పైగా పోస్టులతో ఏపీ విద్యాశాఖ భారీ నోటిఫికేషన్ ప్రకటించింది. అయితే కూటమి ప్రభుత్వం వెలువరించిన ఈ నోటిఫికేషన్ పై వైసీపీ(YSRCP) తీవ్ర విమర్శలు గుప్పించింది. అది మెగా డీఎస్సీ కాదని, మెగా డిస్సపాయింట్మెంట్ అని ఎద్దేవా చేసింది. మెగా డీఎస్సీపై సంతకం చేసిన 10 నెలలకు గాని నోటిఫికేషన్ వేయని ప్రభుత్వం, ఇక పరీక్షలు ఎప్పుడు నిర్వహింస్తుందో.. ఎప్పుడు నియామకపత్రాలు ఇస్తుందో అనేది బిగ్ మిస్టరీ అని విమర్శించింది. ఈ మెగా డీఎస్సీ పూర్తిగా పబ్లిక్ స్టంట్ మాత్రమే గాని, నిరుద్యోగులను అదుకునేది ఎంతమాత్రం కాదని వైసీపీ ఆరోపించింది.
Next Story






