సంక్రాంతి ఎఫెక్ట్.. కేజీ చికెన్ రూ.400?

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-01-13 08:56:09  IST  )

తెలుగు రాష్ట్రాల్లో పల్లెలు సంక్రాంతి శోభతో కళకళలాడుతున్నాయి. ముగ్గులపోటీలు, ఎడ్లపందాలు, కోడి పందేలు, పడవలపోటీలు, క్రికెట్, వాలీబాల్ పోటీలు.. స్పెషల్ ఈవెంట్లు ఆకట్టుకుంటున్నాయి.

సంక్రాంతి ఎఫెక్ట్.. కేజీ చికెన్ రూ.400?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో పల్లెలు సంక్రాంతి శోభతో కళకళలాడుతున్నాయి. ముగ్గులపోటీలు, ఎడ్లపందాలు, కోడి పందేలు, పడవలపోటీలు, క్రికెట్, వాలీబాల్ పోటీలు.. స్పెషల్ ఈవెంట్లు ఆకట్టుకుంటున్నాయి. పట్టణాలు కదిలి పల్లెకు చేరుకున్నట్లుంది వాతావరణం. ఈ క్రమంలో పల్లెల్లో చికెన్ రేట్లు పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో పండుగవేళ చికెన్ రేట్లు పెరగడం షాకిస్తోంది. ఏపీలో విజయవాడతో పాటు ప్రధాన నగరాల్లో కేజీ చికెన్ రేటు రూ.350 ఉంది. చిన్న పట్టణాలు, గ్రామాల్లో అయితే అదనంగా రూ.20 కలిపి రూ.370కి అమ్ముతున్నారు. రెండ్రోజుల్లో కేజీ చికెన్ ను రూ.400 వరకూ కూడా అమ్మొచ్చని తెలుస్తోంది. పండుగ డిమాండ్ ను పౌల్ట్రీ వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు.

తెలంగాణలోని హైదరాబాద్ లో అయితే కిలో కోడిమాంసం రూ.300-320 వరకూ పలుకుతోంది. నాటుకోడి సంగతైతే చెప్పనక్కర్లేదు. మామూలు రోజుల్లో నాటుకోడి రేటు రూ.1000 -1200 ఉంటే ఇప్పుడు ఏకంగా రూ.3000 - రూ.5000 మేర అమ్ముతున్నారు. సీ ఫుడ్ విషయానికొస్తే చికెన్ రేట్లకంటే ఎక్కువ ఉంటున్నాయి. విశాఖ, కాకినాడ, మచిలీపట్నం, బాపట్ల ఇలా సముద్రతీర ప్రాంతాల్లో ఉన్న సిటీల్లో చేపలు, రొయ్యలు, పీతల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గిరాకీని బట్టి సీ ఫుడ్ రేట్లు వేలల్లో ఉండటం గమనార్హం. ఈ ఆదివారం వరకూ ఇదే పరిస్థితి ఉండేలా కనిపిస్తోంది.

Next Story