అనంతబాబు భార్య లక్ష్మీదుర్గకు నాన్‌బెయిలబుల్ వారెంట్... పోలీసుల గాలింపు

by Vemula.Srinu Prasad |

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో వైసీపీ నేత, ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును అప్పట్లో అరెస్ట్ చేశారు....

అనంతబాబు భార్య లక్ష్మీదుర్గకు నాన్‌బెయిలబుల్ వారెంట్...  పోలీసుల గాలింపు
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Ys Jagan Mohan Reddy) ప్రభుత్వ హయాంలో వైసీపీ నేత, ఎమ్మెల్సీ అనంతబాబు(Ycp Leader, Mlc Ananthababu) డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని(Driver Subrahmanyam) హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును అప్పట్లో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై విడుదల అయ్యాయి. అయితే ఇదే హత్య కేసులో అనంతబాబు భార్య లక్ష్మీదుర్గపై సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు ఆరోపణలు చేశారు. దీంతో ఆమెపై సిట్ అధికారులు కేసు నమోదు చేశారు. అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో ఆయన భార్య లక్ష్మీదుర్గ పాత్ర ఉన్నట్లు సిట్ అధికారులు తేల్చారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో లక్ష్మీదుర్గను ఏ-2గా చేర్చారు. ఈ నేపథ్యంలో ఆమె కొద్ది రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లారు.ఈ మేరకు రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ కోర్టులో అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేశారు. దీంతో విచారణ చేపట్టిన ధర్మాసనం లక్ష్మీ దుర్గపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ మేరకు లక్ష్మీదుర్గ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మరోవైపు లక్ష్మీదుర్గ హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆమెపై నాన్ బెయిల్ వారెంట్ జారీ చేసింది.

Next Story