భక్తులకు శుభవార్త.. నేటి నుంచి వెహికల్స్ పై నో టోల్

by Naga Rani Yarlagadda |

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భక్తులు వచ్చే వాహనాలపై నేటి నుంచి టోల్ ఫీజు ఉండదని కలెక్టర్ తెలిపారు. ఈనెల 16 వరకూ ఇది అమల్లో ఉంటుందన్నారు.

భక్తులకు శుభవార్త.. నేటి నుంచి వెహికల్స్ పై నో టోల్
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీశైల క్షేత్రం మహాశివరాత్రి శోభను సంతరించుకుంది. విద్యుద్దీప కాంతులతో వెలిగిపోతున్న శైవక్షేత్రానికి స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వస్తోన్న భక్తుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతుండగా.. శివస్వాములు పెద్దఎత్తున ఆలయానికి తరలి వస్తున్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నేటి నుంచి ఈనెల 16వ తేదీ వరకూ.. శ్రీశైలం దేవస్థానం, అటవీశాఖ టోల్ గేట్ల వద్ద వాహనదారులకు టోల్ ఫీజు చెల్లింపుల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి వెల్లడించారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

బ్రహ్మోత్సవాల ప్రారంభం నుంచి నిన్నటి వరకూ 2,59,050 మంది భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారని వెల్లడించారు. ఇక నంద్యాల - శ్రీశైలం మార్గం ప్రతీ 5 నిమిషాలకొక బస్సు ఉండేలా ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఏపీఎస్ఆర్టీసీ నుంచి 1800, తెలంగాణ ఆర్టీసీ నుంచి 1000, ఇతర ప్రాంతాల నుంచి 200 బస్సులను ఏర్పాటు చేశారు.

Next Story