- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nara Lokesh: టైమ్ డేట్రాసుకోండి.. ఎవరినీ వదిలేది లేదు: మంత్రి లోకేశ్ఫైర్
ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయవద్దని మంత్రి నారా లోకేశ్ సూచించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయవద్దని మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) సూచించారు. విశ్వవిద్యాలయాల్లో(universty) బెదిరించి వీసీలను రాజీనామా చేయించాం అనడం సరికాదన్నారు. ఈ రోజు శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ వీసీ(vice chanseller)లను ఎవరూ రాజీనామా బెదిరించలేదు.. వాళ్ల రాజీనామాకు ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. గవర్నర్ను అవమాన పరిచేలా వైసీపీ సభ్యులు మాట్లాడుతున్నారని అని తెలిపారు. విశ్వవిద్యాలయాలు గవర్నర్ ఆధ్వర్యంలో జరుగుతాయన్నారు. బెదిరించి, పరదాలు కట్టుకుని తిరుగుతాం అనేది తమ పద్ధతి కాదన్నారు. గత ప్రభుత్వం చేసిన అరాచకాలపై విచారణ జరుగుతుందన్నారు. అందుకే ఒకరు జైలులో ఉన్నారని అన్నారు. ఎవరైతే తమ కార్యకర్తలను, ప్రజలను ఇబ్బంది పెట్టారో వారిని వదిలేది లేదన్నారు. టైమ్డేటు రాసి పెట్టుకోండన్నారు. మంత్రి బొత్స మాట్లాడుతూ ఎవరు తప్పు చేస్తే వారు అనుభవిస్తారన్నారు. లోకేశ్మాట్లాడుతూ మీరు చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలన్నారు.
కేంద్రానికి తాము అన్ కండిషనల్ సపోర్ట్ ఇస్తున్నట్లు మంత్రి నారా లోకేష్(Nara Lokesh) వెల్లడించారు. శాసనమండలిలో గవర్నర్ బడ్జెట్ ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానం ఈ రోజు ఉదయం మొదలైంది. ఈ సందర్భంగా పలు వాడి వేడి చర్చ జరిగింది. పలువురు టిడిపి సభ్యులు వైసీపీ సభ్యులు ఈ అంశంపై మాట్లాడారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ లేకపోతే మోడీ ప్రభుత్వం ఉండదని పెద్దలు చెబుతుంటారని వైసీపీ సభ్యులు వరుదు కళ్యాణి అన్నారు. దీనికి మంత్రి నారా లోకేష్ సమాధానం ఇస్తూ తాము పదవులు అడగలేదని, రాష్ట్రానికి నిధులు అడిగామని అన్నారు. గత ప్రభుత్వం చేతగానితనం వల్ల ఇబ్బంది పడుతున్నాం ఆదుకోవాలని తాము కోరామని పేర్కొన్నారు. రైల్వే జోన్(railway zone) ని తీసుకొచ్చామని, విశాఖ ఉక్కుని కపాడామని మంత్రి సమాధానం ఇచ్చారు. అమరావతికి(Amaravathi), పోలవరానికి (Polavaram)తమ నిధులు తీసుకొచ్చామని అన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పలేదా అని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు కోసం 13000 కోట్లు తీసుకొచ్చామన్నారు. కేంద్రం మా పైన ఆధారపడి ఉంది అని అనటం కరెక్ట్ కాదన్నారు. అలా మేము ఇప్పుడు భావించడం లేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సహకారం ఆంధ్ర రాష్ట్రానికి చాలా అవసరం అన్నారు. మేము ఎన్డీఏలో భాగమన్నారు. మీరు ఐదేళ్లలో చేయలేనిది. మేము తొమ్మిది నెలల్లో చేసి చూపించామని లోకేష్ అన్నారు.
తాము అధికారంలో ఉన్నప్పుడు లక్షన్నర ఉద్యోగాలు కల్పించామని, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని వైసీపీ సభ్యులు ప్రశ్నించారు. దీనికి లోకేష్ సమాధానం ఇచ్చారు. నాలుగు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తాము బడ్జెట్ ప్రసంగంలో తెలిపారుమన్నారు. అవకాశాలు కల్పించామని ఇంకా నియమించలేదని ఆయన అన్నారు. మరో రెండేళ్లలో ఇవి పూర్తి అవుతాయని తెలిపారు.






