Banakacharla: బనకచర్ల ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం లేదు..సీఎం చంద్రబాబు నాయుడు

by Thanuru Gopichand |

గోదావరి బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఎవరికి నష్టం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)మరోసారి స్పష్టం చేశారు.

Banakacharla: బనకచర్ల ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం లేదు..సీఎం చంద్రబాబు నాయుడు
X

మేం ఎప్పుడూ తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకించలేదు..

సీఎం చంద్రబాబు నాయుడు ఉద్ఘాటన

సింగయ్య మృతి అంశంలో జగన్​పై విమర్శలు

శవ రాజకీయాలు చేస్తున్నారని మండిపాటు

దిశ, డైనమిక్ ​బ్యూరో : గోదావరి బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఎవరికి నష్టం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)మరోసారి స్పష్టం చేశారు. ఈ రోజు కుప్పంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సముద్రంలోకి పో యే నీళ్లను వాడుకుంటే రాష్ట్రాలు బాగుపడతాయి అన్నారు.. తెలంగాణలో ప్రాజెక్టులపై తాను ఎప్పుడు వ్యతిరేకించలేదని తెలిపారు. నీటి సమస్య పరిష్కారం అయితే తెలుగు ప్రజలు బాగుంటారని అభిప్రాయపడ్డారు. బనకచర్లపై కొంత మంది మాట్లాడుతున్నారు.. ఇది కరెక్టు కాదు. సమైక్యాంధ్రలో నాడు నేనే దేవాదులకు పునాదులు వేశాను, లిఫ్ట్​ ఇరిగేషన్​పెట్టాను అన్నారు. అదే సమయంలో ఇక్కడకు వచ్చిన తర్వాత ఏపీలో పుష్కర, తాడిపూడి రెండు లిఫ్ట్​ ఇరిగేషన్లను తీసుకువచ్చామని తెలిపారు. వైఎస్​రాజశేఖరరెడ్డి ఉన్నపుడు వెల్లంపల్లి అన్నారు.. అది రాలేదు. తర్వాత అది పెద్ద స్కాం అయిందని పేర్కొన్నారు. గోదావరి ఏడాదిలో సగటున రెండువేల టీఎంసీల నీరు సముద్రంలోకి వెళుతున్నాయి.. ఆ నీటిలో 200 టీఎంసీలు ఇక్కడ, అక్కడ వాడుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలు బాగుపడతాయన్నారు. అదే తాను పదేపదే చెబుతున్నానని తెలిపారు.

సింగయ్య మృతి అంశం.. అతని కుటుంబ సభ్యులు వైఎస్​జగన్​ను (YS Jagan) కలవడంపై సీఎం చంద్రబాబు స్పందించారు. తాను ఎప్పుడూ తప్పుడు ప్రచారం చేయలేదని అన్నారు. నీతిమాలిన వాళ్లు, రౌడీలు రాజకీయాల్లో ఉన్నారని పేర్కొన్నారు. కారు కింద కార్యకర్త పడ్డా మానవత్వం చూపించలేదని విమర్శించారు. కుక్క పిల్ల మాదిరిగా సింగయ్యను పక్కన పడేశారు.. సింగయ్య కుటుంబసభ్యులను బెదిరించారు అని చంద్రబాబు పేర్కొన్నారు. కారు కింద పడిన వ్యక్తిని హాస్పిటల్ కి కూడా తరలించే ఓపిక లేదా అని ప్రశ్నించారు. కనీస బాధ్యత సామాజిక స్పృహ లేకుండా ప్రవర్తిస్తారా అని అన్నారు. లింగయ్య భార్యను పిలిపించి బెదిరించి రాజకీయం చేయాలని చూస్తున్నారని తెలిపారు. నేర చరిత్ర కలిగిన వాళ్ళు రాజకీయం చేసుకొని వస్తున్నారని సీఎం అన్నారు. ఏమీ చేయలేని వల్లే శవరాజకీయాలు చేస్తుంటారని అన్నారు. తప్పుడు ప్రచారాలు తాత్కాలికం, చేసిన పనులు శాశ్వతం అన్నారు.

మామిడి రైతుల కష్టాలపై సీఎం సమీక్షించారు. దిగుబడి పెరిగినందుకే మామిడి ధర తగ్గిందన్నారు. రైతులను ఆదుకుంటాం, కేంద్రం సాయం కూడా తీసుకుంటాం అని ఆయన భరోసా ఇచ్చారు. మా ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహ రిస్తోందన్నారు. రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి.. రైతులు అర్ధం చేసుకోవాలన్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం ఇచ్చామని తెలిపారు. అనర్హులకు పెన్షన్ తీసేస్తే రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. వాటాలు వసూలు చేసిన వాళ్లు రైతుల గురించి మాట్లాడుతున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు.

Next Story