- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమరావతి పనులపై .. ఈసీ క్లారిటీ
రాజధాని అమరావతి పనులకు అభ్యంతరం లేదని ఎన్నికల కమిషన్క్లారిటీ ఇచ్చింది.

దిశ, డైనమిక్ బ్యూరో: రాజధాని అమరావతి పనులకు అభ్యంతరం లేదని ఎన్నికల కమిషన్క్లారిటీ ఇచ్చింది.ఈ మేరకు ఈసీ ఓ లేఖ రాసింది. రాజధాని టెండర్లు పిలిచేందుకు కూడా అనుమతించింది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యాక మాత్రమే టెండర్లు ఫైనలైజ్చేయాలని సూచించింది. అమరావతి ప్రాంతంలో పట్టభద్రుల ఎన్నికకు సంబంధించి ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉంది. దీంతో టెండర్లు పిలవడంపై క్లారిటీ కోసం సీఆర్డీఏ ఈసీకి ఓ లేఖ రాసింది. దీనికి సమాధానంగా ఎన్నికల కమిషన్కూడా నో అబ్జక్షన్అంటూ తిరిగి లేఖ రాసింది. అమరావతిలో 14 వేల కోట్ల విలువైన పనులు చేటపట్టామని అవి ప్రస్తుతం టెండర్ల దశలో ఉన్నాయని, వాటిని పూర్తి చేయాలంటే కోడ్ అడ్డం వస్తుందని సీఆర్డీఏ తెలిపింది. ఆ లేఖకు ఈసీ స్పందించింది. టెండర్ల ప్రక్రియ జరుపుకునేందుకు అనుమతినిచ్చింది. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి అమరావతి నిర్మాణానికి రుణం లభించింది. గత నెల నుంచి సీఆర్డీయే బిడ్లను కూడా ఆహ్వానిస్తోంది. వీటిని ఈ నెల ఏడో తేదీన తెరవాల్సి ఉంది. అయితే కోడ్ కారణంగా టెండర్లు ఫైనలైజ్ చేయడానికి అనుమతి నిరాకరించిన ఈసీ, కొత్తవాటిని పిలవడానికి అనుమతి మాత్రం ఇచ్చింది






