‘ఆందోళన వద్దు.. జిల్లాలో కరోనా లేదు’:DMHO

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-23 09:26:27  IST  )

ఏపీ(Andhra Pradesh)లో తాజాగా కొవిడ్ కేసులు నమోదయ్యాయని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

‘ఆందోళన వద్దు.. జిల్లాలో కరోనా లేదు’:DMHO
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లో తాజాగా కొవిడ్ కేసులు నమోదయ్యాయని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. నంద్యాల జిల్లాకు చెందిన ఓ మహిళకు కొవిడ్(Covid) నిర్ధారణ అయినట్లు.. ఆమెను రిమ్స్‌లోని ఐసోలేటెడ్‌వార్డులో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. దీంతో కడప జిల్లాలో కరోనా వ్యాప్తి చెందుతుందా? అని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే.. చికిత్స తీసుకుంటున్న ఆ మహిళ స్వస్థలం నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. నాలుగు రోజులుగా దగ్గు, జలుబుతో బాధపడుతుండగా వైద్యులు పరీక్షలు నిర్వహించారు.

ఈ క్రమంలో ఆ మహిళకు కొవిడ్ నిర్ధారణ కాలేదని డీఎంహెచ్‌వో తేల్చి చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా కేసులు నమోదు కాలేదని డీఎంహెచ్‌వో నాగరాజు తెలిపారు. ఓ మహిళ దగ్గు, జలుబు, జ్వరంతో కడప రిమ్స్‌కు వచ్చిందన్నారు. వృద్ధురాలు తీవ్ర జ్వరం, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో రిమ్స్‌లో చేరారని, పరీక్షలు చేసి విజయవాడ ల్యాబ్ కు పంపించినట్లు చెప్పారు. ముందు జాగ్రత్తగా ఆమెను కొవిడ్ వార్డులో అడ్మిట్ చేశారని తెలిపారు. కానీ ఆమెకు కరోనా లక్షణాలు లేవని, ఎవరు భయపడాల్సిన అవసరం లేదని డీఎంహెచ్‌వో తెలిపారు. కడపలో కరోనా కేసు నమోదైందని కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని డీఎంహెచ్‌వో నాగరాజు తెలిపారు.


Next Story