- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్క్రబ్ టైఫస్ పై ఆందోళన వద్దు : ఏపీ ఆరోగ్యశాఖ
రాష్ట్రంలో రోజురోజుకూ స్క్రబ్ టైఫస్ కేసులు, వాటివల్ల సంభవిస్తున్న మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో రోజురోజుకూ స్క్రబ్ టైఫస్ కేసులు, వాటివల్ల సంభవిస్తున్న మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ 1566 స్క్రబ్ టైఫస్ కేసుల నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రతీ సంవత్సరం శీతాకాలంలో ఈ బ్యాక్టీరియా వస్తుందని, ఇది వెంటనే ప్రాణాంతకం కాదని, స్క్రబ్ టైఫస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.
దీనిపై అంతర్జాతీయ నిపుణులతో చర్చించామని, బ్యాక్టీరియా వల్లే మరణాలు సంభవిస్తున్నాయనేందుకు ప్రూఫ్స్ లేవని తెలిపింది. ఈ మరణాలకు అనేక కారణాలున్నాయని తెలిపింది. ఎవరైనా సరే జ్వరం వస్తే వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లాలని, పేడ పురుగు వల్ల ఈ వైరస్ వస్తున్నందువల్ల.. గ్రామాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. డాక్టర్లు సూచించిన యాంటీ బయాటిక్స్ వాడాలని తెలిపింది. కాగా.. గుంటూరు జీజీహెచ్ లో స్క్రబ్ టైఫస్ లక్షణాలతో నలుగురు చనిపోయినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ తెలిపారు. స్ర్కబ్ టైఫస్ లక్షణాలతో ఆస్పత్రిలో చేరినవారు కోలుకుంటున్నారని పేర్కొన్నారు.






