- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ మహిళలకు షాక్.. ఆ రూట్‌లో ఫ్రీబస్ లేనట్టే
ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళలకు ఫ్రీబస్ పథకాన్ని ప్రవేశపెట్టబోతున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళలకు ఫ్రీబస్ పథకాన్ని ప్రవేశపెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 15 నుండి రాష్ట్రంలో ఫ్రీబస్ కల్పించనున్నారు. అయితే ఫ్రీబస్ ప్రయాణం అంటే రాష్ట్రంలో ఎక్కడ నుండి ఎక్కడివరకు అయినా ఆర్డినరీ మరియు ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచితమే అనుకుంటారు. నిజానికి అది నిజమే కానీ..ఇక్కడే ప్రభుత్వం ఓ ట్విస్ట్ ఇచ్చింది. రాష్ట్రంలో ఒకచోట మాత్రం ఫ్రీబస్ ఉండదని ప్రకటించింది.
ఈ మేరకు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖలో డిపో మేనేజర్ల సమీక్ష సమావేశంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణతో జరిగిన సమయంలో తిరుమలరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుపతి నుండి తిరుమలకు వెళ్లే సప్తగిరి ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదని చెప్పారు. అంతే కాకుండా ఉచిత బస్సు సౌకర్యం ఘాట్ రోడ్డులో రాకపోకలు కొనసాగించే బస్సుల్లో ఉండదని స్పష్టం చేశారు. భద్రతా కారణాల దృశ్య ఆయా రూట్లతో ఉచిత బస్సు పథకాన్ని వర్తింపజేయడం లేదని అన్నారు.






