- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP News : ఏపీ ప్రజలకు భారీ గుడ్ న్యూస్
ఏపీ(AP) ప్రజలకు భారీ శుభవార్త. ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి విద్యుత్ చార్జీల పెంపు లేదని ప్రకటించారు అధికారులు.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP) ప్రజలకు భారీ శుభవార్త. ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి విద్యుత్ చార్జీల పెంపు లేదని ప్రకటించారు అధికారులు. ఈ మేరకు ఈఆర్సీ ఛైర్మన్ ఠాకూర్ రామ్ సింగ్(APERC Chairman Thakur Ram Singh) వ ప్రకటన జారీ చేశారు. 2025-26 సంవత్సరానికి చెందిన ఏపీ విద్యుత్ చార్జీల టారిఫ్(Power Charges Tariff) లను గురువారం ఏపీఈఆర్సీ వెల్లడించారు. అయితే ఈ టారిఫ్ ల వివరాలను మార్చి 31 లోపు విడుదల చేయాల్సి ఉన్నా.. నెల రోజుల ముందుగానే విడుదల చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ విభాగాల్లో దేనిలో కూడా ఈ ఏడాది విద్యుత్ చార్జీల పెంపు లేదని తెలియజేశారు. దీంతో రాష్ట్ర ప్రజలకు కరెంటు బిల్లుల కష్టాల నుంచి భారీ ఊరట లభించినట్టైంది. ఈ మేరకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు ఏపీ ప్రజలు. అయితే ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా కరెంట్ ఛార్జీలు పెంచారని.. ఇపుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా విద్యుత్ చార్జీలను భారీగా పెంచనుందనే ప్రచారం సాగింది. ఈ ప్రచారానికి తెరదించుతూ.. విద్యుత్ నియంత్రణ మండలి ఈ కీలక ప్రకటన విడుదల చేసిందని తెలుస్తోంది.






