No Drone Zone: ‘నో డ్రోన్ జోన్’ ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో డ్రోన్స్ నిషేధం

by Ramesh Naini |

ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న అంతర్జాతీయ స్థాయి సీఐఐ పార్ట్‌నర్‌షిప్‌ సమ్మిట్‌ సందర్భంగా విశాఖ సిటీ పోలీస్ భారీ భద్రతను ఏర్పాట్లు చేస్తోంది.

No Drone Zone: ‘నో డ్రోన్ జోన్’ ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో డ్రోన్స్ నిషేధం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న అంతర్జాతీయ స్థాయి సీఐఐ పార్ట్‌నర్‌షిప్‌ సమ్మిట్‌ సందర్భంగా విశాఖ సిటీ పోలీస్ భారీ భద్రతను ఏర్పాట్లు చేస్తోంది. భద్రతా చర్యలలో భాగంగా విశాఖ సిటీ పోలీసులు డ్రోన్‌ల వినియోగంపై కఠిన నిబంధనలు విధించారు. కన్వెంట్ జంక్షన్ నుంచి ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ వరకు 5 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్‌లు ఎగరవేయడం లేదా ఆపరేట్ చేయడం నిషేధించారు. ఈ నిషేధం 2025 నవంబర్ 12న ఉదయం 6 గంటల నుంచి 2025 నవంబర్ 16 వ తేదీ ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటుంది. డ్రోన్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై Aircraft Act, 1934 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని విశాఖపట్నం కమిషనర్ ఆఫ్ పోలీస్, అదనపు జిల్లా మేజిస్ట్రేట్ తాజాగా ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఈ మేరకు ‘నో డ్రోన్ జోన్’ అంటూ ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో వార్నింగ్ వాల్ పోస్టర్లను విడుదల చేశారు.

Next Story