మొంథా సైక్లోన్ : ఏపీలో నిర్మలా సీతారామన్ పర్యటన వాయిదా

by Muthe.Rajitha |

ఏపీలో మొంథా తుఫాను తీవ్ర ప్రభావం చూపనుంది.

మొంథా సైక్లోన్ : ఏపీలో నిర్మలా సీతారామన్ పర్యటన వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో మొంథా తుఫాను తీవ్ర ప్రభావం చూపనుంది. అక్టోబర్ 28న కాకినాడ వద్ద తుఫాను తీరం దాటనుంది. ఈ క్రమంలో 100కి.మీల వేగంతో ఈదురు గాలులు, భారీ నుంచి అతి భారీ వర్షాలు ఏపీని ముంచెత్తనున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఏపీలో జరగనున్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన వాయిదా పడింది. అక్టోబర్ 28న ఏపీ రాజధాని అమరావతిలో ఒకేసారి 12 బ్యాంకులకు శంకుస్థాపన చేసేందుకు నిర్మలా సీతారామన్ రేపు రాష్ట్రానికి రావాల్సి ఉంది. కానీ మొంథా తుఫాన్ కారణంగా మంత్రి పర్యటన వాయిదా పడినట్లు అధికారులు వెల్లడించారు. తదుపరి తేదీ త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. కాగా మొంథా తుఫాను నేపథ్యంలో ప్రభుత్వం, అధికారులు అలర్ట్ అయ్యారు.

Next Story