- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆయన వల్లే నిమిష ప్రియ ప్రాణం మళ్ళీ చిక్కుల్లోకి : KA పాల్
కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియ(Nimisha Priya), యెమెన్‌లో తలాల్ అబ్దో మహ్మదీ హత్య కేసులో మరణ శిక్ష ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియ(Nimisha Priya), యెమెన్‌లో తలాల్ అబ్దో మహ్మదీ హత్య కేసులో మరణ శిక్ష ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆమె శిక్షను రద్దు చేయడానికి లేదా బ్లడ్ మనీ ద్వారా క్షమాపణ పొందేందుకు కేంద్ర ప్రభుత్వం, కేరళ ప్రభుత్వం, పలు ఎన్జీవోస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ. పాల్(KA Paul) పలు కీలక వ్యాఖ్యలు చేసారు. నిమిష ప్రియను ఉరిశిక్ష నుంచి కాపాడేందుకు 19 రోజులుగా తాను తీవ్రంగా కృషి చేస్తుండగా.. భారత గ్రాండ్ ముఫ్తీ కాంతపురం షేక్ అబూబకర్ ముస్లియార్ ఇచ్చిన అబద్దపు ప్రకటనలు ఈ కేసును మరింత జటిలం చేశాయని ఆరోపించారు.
షేక్ అబూబకర్ జూలై 29న విడుదల చేసిన ప్రకటనలో నిమిషా ప్రియ ఉరిశిక్ష రద్దయినట్లు ప్రకటించారు. ఈ ప్రకటనలు బాధితుడైన తలాల్ కుటుంబాన్ని కలవర పెట్టాయని, దీని వల్ల క్షమాపణ చర్చలు మరింత క్లిష్టమయ్యాయని కే.ఏ. పాల్ వాదిస్తున్నారు. షేక్ అబూబకర్ తక్షణమే తలాల్ కుటుంబానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు.
నిమిష ప్రియ కేసు నేపథ్యం: నిమిషా ప్రియ 2017లో తలాల్ అబ్దో మహదీని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంది. ఆమె తన స్పాన్సర్‌గా ఉన్న తలాల్ తన పాస్‌పోర్ట్ స్వాధీనం చేసుకొని, లైంగికంగా వేధించినట్లు ఆరోపించింది. ఈ క్రమంలో అతనికి అధిక మోతాదులో మత్తు మందు ఇవ్వడం వల్ల మరణించాడని, ఆ తర్వాత ఆమె అతని మృతదేహాన్ని ముక్కలు చేసి వాటర్ ట్యాంక్‌లో పడేసినట్లు కోర్టు నిర్దారించింది. యెమెన్ సుప్రీంకోర్టు 2024లో ఆమె అప్పీలును తిరస్కరించి, ఉరిశిక్షను ఖరారు చేసింది. జూలై 16, 2025న ఉరిశిక్ష అమలు కావాల్సి ఉండగా, చివరి నిమిషంలో యెమెన్ ప్రభుత్వం దానిని వాయిదా వేసింది.
అయితే, షేక్ అబూబకర్ కార్యాలయం జారీ చేసిన ప్రకటనలో ఉరిశిక్ష రద్దయినట్లు పేర్కొనడంతో, ఈ సమాచారం నిజం కాదని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. యెమెన్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని, కేసు ఇప్పటికీ విచారణలో ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం, నిమిషా ప్రియ కేసులో బ్లడ్ మనీ చెల్లింపు కోసం చర్చలు కొనసాగుతున్నాయి, కానీ తలాల్ కుటుంబం నిరాకరిస్తోంది. షరియా చట్టం కింద ప్రతీకార న్యాయం (కిసాస్) కోరుతోంది.






