వైసీపీ నేతల ఆందోళన .. ఈసీ ఆఫీస్ ఎదుట ఉద్రిక్తత

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-09 08:39:19  IST  )

విజయవాడ ఎన్నికల కమిషన్ కార్యాలయంఎదుట వైసీపీ నేతలు ఆందోళకు దిగారు.

వైసీపీ నేతల ఆందోళన .. ఈసీ ఆఫీస్ ఎదుట ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ ఎన్నికల కమిషన్ కార్యాలయం(Election Commission Office) ఎదుట వైసీపీ(Ycp) నేతలు ఆందోళకు దిగారు. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ(Tdp) నేతలు దౌర్జన్యానికి పాల్పడుతున్నారంటూ, వారిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని నినాదాలు చేశారు. ఈసీ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేకుండా లోపలి వెళ్లొద్దని నిలదీశారు. ఈ పరిణామంతో పోలీసులపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ కార్యాలయంలోకి వెళ్లేందుకు మరింతగా ప్రయత్నం చేశారు. దీంతో ఈసీ కార్యాలయం వద్ద ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ప్రభుత్వం, పోలీసులపై మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఇంత ఘోరంగా దేశంలో ఎక్కడా ఎన్నికలు జరిగి ఉండవు. ఈసీ కూడా నిద్రపోయినట్లు నటిస్తోంది. ఇక ప్రజాస్వామ్యం ఎలా బతుకుతుంది.’’ అని ప్రశ్నించారు.

Next Story