- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు యత్నం.. బెడిసికొట్టడంతో..
నేటి కాలంలో వివాహేతర సంబంధాలు కాపురాలను కూల్చడమే కాదు.. మనుషుల ప్రాణాలను కూడా బలిగొంటున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్ : నేటి కాలంలో వివాహేతర సంబంధాలు కాపురాలను కూల్చడమే కాదు.. మనుషుల ప్రాణాలను కూడా బలిగొంటున్నాయి. అక్రమ సంబంధాల మోజులో భార్యల్ని భర్తలు, భర్తలను భార్యలు హత్యలు చేస్తున్న ఘటనలు కోకొల్లలు. తాజాగా నెల్లూరు జిల్లాలో భార్య తన ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు ప్లాన్ చేయగా.. అది కాస్తా బెడిసికొట్టింది. భర్తను అడ్డు తొలగిస్తే.. ప్రియుడితే ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చని భావించిన భార్య.. చివరికి ప్రియుడితో కలిసి ఆమె జైలు పాలయ్యింది.
వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని సంగం మండలం అనసూయ నగర్లో భర్తను చంపేందుకు భార్య ప్రయత్నించింది. భర్త పెంచల ప్రసాద్ స్థానికంగా పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో వెంకటేష్ అనే వ్యక్తితో భార్య కామాక్షికి ఏర్పడిన పరిచయం వివాహేతర పరిచయానికి దారితీసింది. ఈ విషయం తెలుసుకున్న ప్రసాద్.. భార్యను మందలించాడు. దీంతో భర్తపై కోపం పెంచుకున్న కామాక్షి.. ప్రియుడితో కలిసి అంతమొందించాలని ప్లాన్ చేసింది. ప్రసాద్ పై వెంకటేష్ దాడి చేసి చంపేందుకు ప్రయత్నించగా.. గట్టిగా కేకలు పెట్టాడు. దీంతో స్థానికులు అప్రమత్తమై వెంకటేష్.. అతనితో ఉన్న మరో ఇద్దరిని అడ్డుకున్నారు. పోలీసులకు సమాచారమివ్వగా.. వారు అక్కడికి చేరుకుని వెంకటేష్, కామాక్షిలను అరెస్ట్ చేశారు.






