- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లిక్కర్ స్కామ్‌లో అసలు సొర చిక్కితేనే ఎండ్ కార్డ్: ప్రత్తిపాటి పుల్లారావు
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న వేళ.. మాజీమంత్రి, టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న వేళ.. మాజీమంత్రి, టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకూ చిక్కింది చిన్న ఎరలే అని, అసలు సొర చిక్కితేనే లిక్కర్ మాఫియా ఆటకు ఎండ్ కార్డ్ పడినట్లవుతుందన్నారు. చీప్ లిక్కర్ తాగి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని, అలాంటి వారందరికీ న్యాయం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గత పాలకుల అవినీతి, దోపిడీల పుట్టలు బద్దలయ్యాయన్న పేర్కొన్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు పాటిస్తున్న నిష్పక్షపాత విధానాలు, పారదర్శక పాలన, సిట్ విచారణతో మద్యం మాఫియా గుట్టు రట్టయిందని తెలిపారు. సాక్ష్యాలను మాయం చేసినా, ఆధారాలను ధ్వంసం చేసినా ఎలా పట్టుబడ్డామా అని నిందితులు గంగవెర్రులెత్తి పోతున్నారన్నారు. ప్రజా ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతూ, ఆవేశంలో విమర్శలు చేస్తూ.. తాము చేసిన పాపపు పనుల నుంచి ప్రజల దృష్టి మళ్లించాలని ప్రయత్నిస్తున్నారన్నారు. జగన్ అండ్ కో నిజంగా తప్పు చేసి ఉండకపోతే తమ నిజాయితీ ఏంటో చట్టానికి సహకరించి నిరూపించుకోవాలని సవాల్ చేశారు.






