- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Namabala Keshava Rao : కేశవరావు మృతి వార్తలు అవాస్తవం : ఏపీ పౌరహక్కుల సంఘం
by Muthe.Rajitha |
మావోయిస్టు పార్టీ అగ్రనేత నంబాల కేశవరావు(Namabala Keshava Rao) అలియాస్ బసవరాజ్ అలియాస్ గంగన్న మృతిపై వస్తున్న వార్తలను ఏపీ పౌరహక్కుల సంఘం(AP Civil Rights Association) ఖండించింది.

X
దిశ, వెబ్ డెస్క్ : మావోయిస్టు పార్టీ అగ్రనేత నంబాల కేశవరావు(Namabala Keshava Rao) అలియాస్ బసవరాజ్ అలియాస్ గంగన్న మృతిపై వస్తున్న వార్తలను ఏపీ పౌరహక్కుల సంఘం(AP Civil Rights Association) ఖండించింది. ఆయన క్షేమంగా ఉన్నారని, ఎన్కౌంటర్లో గంగన్న చనిపోయారని వస్తున్న వార్తలు అవాస్తవం అని ప్రకటించింది. ఈ మేరకు ఏపీ పౌరహక్కుల సంఘం కార్యదర్శి చంద్రశేఖర్ ఓ ప్రకటనలో తెలియజేశారు. అయితే ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లోని నారాయణపూర్(Narayapur Encounter) లో బుధవారం జరిగిన ఎదురు కాల్పుల్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మృతుల్లో మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రెటరీ నంబాల కేశవరావు కూడా ఉన్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amith Sha) ప్రకటించారు. అందుకు సంబంధించిన ఫోటో కూడా బయటికి వచ్చింది.
Next Story






