ఆ రోజు నాకు ఫోన్ చేసిన ఏకైక వ్యక్తి ఆయన: మంత్రి నారా లోకేశ్ ఎమోషన్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-05-27 10:17:54  IST  )

టీడీపీ మహానాడులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై మంత్రి నారా లోకేశ్ ఎమోనల్‌గా మాట్లాడారు. తన తండ్రిని అన్యాయం అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకు పంపితే.. తనకు ఫోన్ చేసి అండగా ఉంటానని చెప్పిన ఏకైక వ్యక్తి పవన్ కల్యాణ్ అన్న అని ఆయన చెప్పారు. .

ఆ రోజు నాకు ఫోన్ చేసిన ఏకైక వ్యక్తి ఆయన: మంత్రి నారా లోకేశ్ ఎమోషన్
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ మహానాడు(Tdp Mahanadu)లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌(Deputy Cm Pawan Kalyan)పై మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) ఎమోనల్‌గా మాట్లాడారు. తన తండ్రిని అన్యాయం అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకు పంపితే.. తనకు ఫోన్ చేసి అండగా ఉంటానని చెప్పిన ఏకైక వ్యక్తి పవన్ కల్యాణ్ అన్న అని ఆయన చెప్పారు. ‘‘నీకు ఏ సమస్య వచ్చినా అన్నగా నేను నీకు తోడుంటా’’ అని పవన్ కల్యాణ్ చెప్పారని లోకేష్ తెలిపారు. ఏ సమస్య ఉన్నా తనకు ఫోన్ చేయాలని పవన్ కల్యాణ్ తనకు భరోసా ఇచ్చారని పేర్కొన్నారు.


అందుకే ఎన్నికల్లో కలిసి పోటీ చేశామన్నారు. ఇప్పుడు మూడు పార్టీల కార్యకర్తలున్న అతి పెద్దగా కూటమిగా అవతరించామన్నారు. మూడు పార్టీలు కలిసికట్టుగా పని చేయాలని, చిన్న చిన్న సమస్యలుంటూ పరిష్కరించుకోవాలని మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కాబట్టే విశాఖ ఉక్కును కాపాడుకోగలిగామని చెప్పారు. విశాఖ రైల్వే జోన్ ను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. త్వరలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు కూడా చేయబోతున్నామని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. ఫైటర్ జెట్ తయారు చేసే పరిశ్రమను సైతం తీసుకొస్తున్నామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.


Next Story