- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాశీబుగ్గ తొక్కిసలాట.. నిర్మాణకర్త ఆశయం గొప్పదే.. కానీ : మంత్రి ఆనం
కాశీబుగ్గ దేవాలయంలో నిన్న తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదివారం ఉదయం పరిశీలించారు.

దిశ, వెబ్‌డెస్క్: కాశీబుగ్గ దేవాలయంలో నిన్న తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదివారం ఉదయం పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రైవేటు ఆలయమైనా దానిపై ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందన్నారు. తొక్కిసలాటలో 9 మంది మరణించగా.. పలాస పీహెచ్ సీలో 12 మంది, శ్రీకాకుళంలో ముగ్గురు చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఆలయాన్ని నిర్మించిన హరిముకుంద్ పాండా సంకల్పం మంచిదే అయినా.. నిర్మాణం విషయంలో నిపుణుల సలహా తీసుకుని ఉంటే ఇలాంటి ప్రమాదం జరిగి ఉండకపోయేదన్నారు.
ఈ ప్రాంత ప్రజలు తిరుమలకు వెళ్లలేకపోయినా ఆ వేంకటేశ్వరస్వామివారి ఆశీస్సులు అందాలన్న మంచి ఉద్దేశంతో ఆయన ఆలయాన్ని నిర్మించారని ఆ ఆలయాన్ని చూస్తే తెలుస్తోందన్నారు. ఆలయ నిర్మాణంలో ఇతర దాతలెవరూ లేరని, తన సొంత నిధులతోనే ఈ ఆలయాన్ని పట్టుదల, కృషితో నిర్మించారన్నారు. అలాంటి ఆలయంలో ఇలాంటి విషాద ఘటన జరగడం బాధాకరమన్నారు. కానీ ఆలయ నిర్మాణంలో చిన్న చిన్న లోపాలున్నాయని, వాటిని సరిచేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.






