- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రి లోకేశ్ ఆధ్వర్యంలో కీలక కమిటీ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం
మంత్రి లోకేశ్ ఆధ్వర్యంలో కీలక కమిటీ ఏర్పాటు అయింది....

దిశ, వెబ్ డెస్క్: గతకొంతకాలంలో రాష్ట్రంలో దుష్ప్రచారాలు ఎక్కువయ్యాయి. ఇందుకు సోషల్ మీడియా వేదికగా నిలుస్తోంది. ఫేక్ ప్రచారాలు సైతం హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా పార్టీలు, రాజకీయ నాయకులను కొందరు కించపరుస్తూ, ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు, పోస్టులు పెడుతున్నారు. దీంతో అసత్యాలు చెలరేగిపోతున్నాయి. కొన్ని సమయాల్లో సోషల్ మీడియా పోస్టులు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయి. శాంతి భద్రతల సమస్యలు ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాలను నియంత్రించాలని ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా మంత్రుల కమిటీని నియమించింది. మంత్రి నారా లోకేశ్ ఆధ్యర్వంలో ఈ కమిటీ పని చేయనుంది. ఈ కమిటీ సభ్యులుగా మంత్రులు అనిత, సత్యకుమార్, నాదెండ్ల, పార్థసారథి పని చేయనున్నారు. తప్పుడు ప్రచారం, మిస్ఇన్ఫర్మేషన్, నేషనల్ సెక్యూరిటీ ముప్పులపై చర్చించి చర్యలకు సిఫారసులు చేయనున్నారు. పౌర హక్కుల పరిరక్షణకు మంత్రుల కమిటీ సూచనలు ఇవ్వనున్నారు.






