- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్వాష్ చేయండి.. జోగి రమేశ్ రిక్వెస్ట్
తనపై నమోదైన కేసు ఏపీ మాజీ మంత్రి జోగి రమేశ్ హైకోర్టును ఆశ్రయించారు...

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ మంత్రి జోగి రమేశ్(Former Minister Jogi Ramesh) హైకోర్టు(High Court)ను ఆశ్రయించారు. తనపై నమోదు అయిన కేసులను క్వాష్ చేయాలని పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై బుధవారం విచారణ జరిగే అవకాశం ఉందని జోగి రమేశ్ తరపు లాయర్లు తెలిపారు. కాగా కల్తీ లడ్డూ వ్యవహారంలో సిట్ నివేదికలో తమకు క్లీన్ ఇచ్చినట్లు చెప్పుకుంటూ ఏపీ సీఎం చంద్రబాబు, నారా లోకేశ్ జోగి రమేశ్ తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఆయనపై పలు పోలీస్ స్టేషన్లలో టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జోగి రమేశ్‌పై తిరుపతి, ఇబ్రహీపట్నంలో కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులపై ఆయన పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో కోర్టు తీర్పుపై అనుచరులు, ఇబ్రహీంపట్నం వైసీపీ నేతలు ఉత్కంఠ నెలకొంది.
ఇబ్రహీంపట్నంలో రణరంగం
కాగా విజయవాడ ఇబ్రహీంపట్నంలో రణరంగం జరిగిన విషయం తెలిసిందే. శ్రీవారి లడ్డూ ఘటనపై సిట్ నివేదిక సమర్పించిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు, నారా లోకేశ్‌పై చేసిన అసభ్య వ్యాఖ్యలపై టీడీపీ నేతలు భగ్గుమన్నారు. జోగి రమేశ్ ఇంటిపై దాడి చేశారు. పెట్రోల్ బాంబులు విసిరి మంటలు చెలరేగించారు. వాహనాలతో పాటు ఇంటి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో జోగి రమేశ్ కుటుంబం భయబ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనలోనూ సీఎ చంద్రబాబు, నారా లోకేశ్‌పై ఘాటు విమర్శలు చేశారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని హెచ్చరించారు. అంతేకాదు
ఇంటి వద్ద జరిగిన ఘటనపై..
తన ఇంటి వద్ద జరిగిన ఘటనపై పోలీసులతో కేసులు నమోదు చేయించాలని జోగి రమేశ్ కోర్టు ద్వారా ఆదేశాలు తీసుకొచ్చారు. దీంతో 40 మంది టీడీపీ నేతలపై కేసులు నమోదు అయ్యాయి. వీరిలో 11 మందికి బెయిల్ మంజూరు అయ్యాయి. ఈ పరిణామాలు కొనసాగుతుండగానే జోగి రమేశ్‌పై కేసులు నమోదు అవడంపైనా ఆయన స్పందించారు. తనపై ప్రభుత్వం కక్ష గట్టిందని అందుకే అక్రమంగా కేసులు పెడుతోందని ఆరోపించారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను తాను ప్రశ్నిస్తుండం వల్లనే తనపై ఈ చర్యలని జోగి రమేశ్ మండిపడుతున్నారు. అయితే రణరగం, కేసులతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.






