- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాయలసీమ దోషిగా జగన్.. దమ్ముంటే అసెంబ్లీకి రండి : ఏపీ చీఫ్ విప్ సవాల్
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ దోషిగా మిగిలిపోయారని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు (GV Anjaneyulu) మండిపడ్డారు.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ దోషిగా మిగిలిపోయారని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు (GV Anjaneyulu) మండిపడ్డారు. రాయలసీమలోజగన్ కు ఒక్క ఓటు కూడా రాదన్నారు. వైసీపీ (YCP) యూరియా సంక్షోభాన్ని సృష్టించేందుకు కుట్రపన్నుతోందని, రైతుల ముసుగు వేసుకుని అన్నదాతల్ని వైసీపీ మోసం చేస్తోందని విమర్శించారు. రైతుల సమస్యలను తీర్చాలని నిజంగా వైసీపీకి శ్రద్ధ ఉంటే.. వారి సమస్యలపై చర్చించేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలని ఛాలెంజ్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తే.. వారికి గంట సమయం అధికంగా ఇచ్చేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
ఎలాంటి సంక్షోభాలనైనా ఎదుర్కొని, వాటిని పరిష్కరించి.. అవకాశంగా మలచుకోవడంలో సీఎం చంద్రబాబుని మించినవారెవరూ లేరని జీవీ ఆంజనేయులు కొనియాడారు. కరువుసీమగా పేరు తెచ్చుకున్న రాయలసీమలో హంద్రీనీవాతో (Handri Neeva) నీళ్లు తీసుకొచ్చి.. సీమను సస్యశ్యామలం చేసిన గొప్పతనం ఆయనకే చెందుతుందన్నారు.






