మధురైలో ఇలా జరుగుతుందని ఊహించలేదు: పవన్ కల్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-22 14:59:34  IST  )

మధురైలో ఇలా జరుగుతుందని ఊహించలేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు..

మధురైలో ఇలా జరుగుతుందని ఊహించలేదు: పవన్ కల్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: మధురై(Madurai)లో జరిగిన మురుగన్ భక్త సమ్మేళం(Murugan Bhakta Sammelan)లో తమిళ సోదరులను ఆకట్టుకునేలా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) స్థానిక భాషలో మాట్లాడి అదరగొట్టారు. ప్రసంగంలో మురుగన్ స్వామిని ఉద్దేశించి తమిళంలో స్పీచ్ ఇచ్చారు. ‘‘నేను తమిళనాడులో పెరిగా. తమిళ సంస్కృతి, భాష అంటే నాకు చాలా ఇష్టం. ఇన్ని లక్షల మంది తమిళల మధ్య మాట్లాడతానని, ఇలాంటి రోజు ఒక్కటి వస్తుందని తాను అసలు ఊహించలేదు. మురుగన్ చూపించిన దారి వల్లే నేను ఈ రోజు ఇలా ఉన్నా. మురుగన్ చూపించిన దారి ధైర్యం, వీరత్వం, ప్రేమ. మురుగన్ చూపించిన దారిలో నడిస్తే విజయం వస్తుంది. మంచి కోసం మార్పు తీసుకొస్తుంది. దారి కష్టమైంది. కానీ ఫలాన్ని ఇచ్చేది, ధైర్యాన్ని నింపేది, అనుకున్నది సాధించేది. మనము ఎంచుకునే దారిలో అరాచక శక్తులు, శత్రువులు ఉంటాయి, భయపెడతాయి. కానీ మురుగన్ తోడుంటే మనకేంటి భయం. మార్పు తీసుకురావడం చాలా కష్టం. అందరం అనుకుంటే మంచి మార్పు వస్తుంది.’’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Next Story